‘యోగా’నందం..


Sun,December 15, 2019 11:06 PM

-యోగాతో ఒత్తిడి దూరం
-ప్లాస్టిక్‌ను వాడొద్దు..
-యోగాను స్పోర్ట్స్‌ కోటాలోకి తెచ్చేందుకు కృషి చేస్తా
-ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : ఆధునిక జీవన విధానం ద్వారా నిత్యం పెరుగుతున్న మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలి... యోగా కార్యక్రమాలు సిద్దిపేటలో నిత్యం జరుగుతున్నాయి... అలాగే, తెలంగాణ అంతా యోగా కార్యక్రమాలు విస్తరించి, ఆరోగ్య తెలంగాణ కావాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం విపంచి కళానిలయంలో జరిగిన రాష్టస్థాయి యోగా పోటీల ముగింపు సమావేశాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రశంసాపత్రాలతోపాటు మెడల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ శారీరక, మానసిక ఒత్తిడిని యోగా దూరం చేస్తుందన్నారు. యోగాతో అనేక లాభాలు ఉన్నాయని.. నిత్యం యోగా చే యాలన్నారు. యోగాను స్పోర్ట్స్‌ విభాగంలోకి తేవడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టడా నికి ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ వాడకాన్ని వీడాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో సిద్దిపేట పట్టణం పచ్చ ని చెట్లతో హరిత వనాలను తలపిస్తున్నాయన్నారు. యోగా కు మంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.

-ఆరోగ్య తెలంగాణ నిర్మాణం
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని.. ఆరోగ్యంగా ఉండడమే సంపద అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసేలా మంత్రి హరీశ్‌రావు పాఠశాల స్థాయిలో యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఒత్తిడి కలుగకుండా ప్రశాంతంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాయిరాం, ప్రెస్‌ అకాడమీ సభ్యుడు అంజయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, యోగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్‌, బ్రిజి భూషణ్‌, యోగా గురువు గణేశ్‌కుమార్‌, యోగా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు తోట అశోక్‌, శ్రీనివాస్‌రెడ్డి, సతీశ్‌, రాజలింగం, శిశురక్ష దవాఖాన వైద్యు డు మహేశ్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు.

-యోగా విజేతలు వీరే..
1, 60ఏండ్ల పురుషుల విభాగంలో..
1వ స్థానంలో అప్పారావు (రంగారెడ్డి జిల్లా), 2వ స్థానంలో గంగారాం (కామారెడ్డి), 3వ స్థానంలో సాయికుమార్‌ (నిజామాబాద్‌), 4వ స్థానంలో జనార్దన్‌ (సిద్దిపేట). మహిళల విభాగంలో 1వ స్థానంలో రాజ్యలక్ష్మి (నిజామాబాద్‌), 2వ స్థానంలో శోభజాదవ (నిజామాబాద్‌), 3వ స్థానంలో లలిత (నిజామాబాద్‌) నిలిచారు.
2, అండర్‌- 50 నుంచి 60 విభాగంలో..
1వ స్థానంలో శంకర్‌ (కామారెడ్డి), 2వ స్థానం లో రఘు(నిజామాబాద్‌), 3వ స్థానంలో అనూప్‌కుమార్‌ మండల్‌ (హైదరాబాద్‌), 4వ స్థానంలో అంజయ్య (సిద్దిపేట). మహిళల విభాగంలో.. శ్యా మల (నిజామాబాద్‌), రాధిక (హైదరాబాద్‌).
3, అండర్‌ - 40 నుంచి 50 పురుషులు..
అశోక్‌ (సిద్దిపేట), రాజశేఖర్‌ (నిజామాబాద్‌), సూరం రవి (ఆదిలాబాద్‌). మహిళలు.. మోనిత (హైదరాబాద్‌), స్వరూపారాణి(నల్గొండ), డి.పద్మ (హైదరాబాద్‌), విజయలక్ష్మి (సిద్దిపేట).
4, అండర్‌- 30 నుంచి 40 పురుషులు..
నాగేశ్వర్‌రావు (సూర్యపేట), అనిల్‌కుమార్‌ (కామారెడ్డి), జి.రాములు (సిద్దిపేట), ఎం.గణేశ్‌(సిద్దిపేట).
మహిళల విభాగంలో జి.రమ (నిజామాబాద్‌), సరోజు ఓంకార్‌ రచాటే (హైదరాబాద్‌), సుజాత (నిజామాబాద్‌), వసంతలక్ష్మి (హైదరాబాద్‌).
5, అండర్‌- 20 నుంచి 30 పురుషుల విభాగం..
రమేశ్‌గౌడ్‌ (హైదరాబాద్‌), గంగాధర్‌ (నిజామాబాద్‌), నితిన్‌ (హైదరాబాద్‌), ప్రవీణ్‌(సిద్దిపేట).
మహిళలు.. నైనా ఉపాధ్యాయ్‌ (హైదరాబాద్‌), రౌత్‌బింధు (హైదరాబాద్‌), అనూష ఒడ్నాల (నిజామాబాద్‌), మాలపాని హర్షిత (హైదరాబాద్‌).
6, అండర్‌ - 14 నుంచి 20 బాలుర..
శ్రీనివాస్‌ (ఆదిలాబాద్‌), శశాంక్‌ (నిజామాబాద్‌), భూమేశ్‌ (నిజామాబాద్‌), శ్రావణ్‌ (రంగారెడ్డి). బాలికలు.. ఆర్ఫామోహిన్‌ (నిజామాబాద్‌), శ్రీతన్షిక(హైదరాబాద్‌), ఎం.లావణ్య (కామారెడ్డి), నిషా (హైదరాబాద్‌).
7, అండర్‌ -8 నుంచి 14 బాలుర..
సోమేశ్‌కుమార్‌ (నల్గొండ), విజయ్‌కుమార్‌ (వరంగల్‌), ధనూష్‌ (నిజామాబాద్‌), మనీష్‌ (నిజామాబాద్‌).
బాలికలలో లిఖిత (నిజామాబాద్‌), ఇందు (నిజామాబాద్‌), నిర్ణయ (నిజామాబాద్‌), కీర్తన (నిజామాబాద్‌)లు వరుసుగా 1, 2, 3, 4వ స్థానాల్లో విజేతలుగా నిలిచారు.
ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిజామాబాద్‌ జిల్లా, ద్వితీయ స్థానంలో హైదరాబాద్‌, తృతీయ స్థానంలో సిద్దిపేట జట్లు నిలిచాయి. విజేతలకు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ప్రతి గ్రూపులో 1వ స్థానాల్లో నిలిచినవారు ఈ నెల 27 నుంచి 29 వరకు బెంగుళూర్‌లో జరిగే జాతీ యస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...