జల సంబురం..


Sun,December 15, 2019 11:03 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న మారెడ్డి చెరువులోకి గోదావరి జలాలు రావడంతోపాటు రెండు రోజులుగా మత్తడి దూకుతుంది. ఈ మేరకు ఆదివారం ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం తదితరులు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చిత్రపటాలకు పోతిరెడ్డిపల్లి చెరువు వద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. మారెడ్డి చెరువును నీటి పారుదల శాఖ అధికారులు అభివృద్ధి చేశారని, తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నుంచి మారెడ్డి చెరువులోకి గోదావరి జలాలు తీసుకువచ్చిన ఎమ్మెల్యేకు రైతులు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల మాజీ అధ్యక్షుడు శివగారి అంజయ్య, వైస్‌ ఎంపీపీ నవీన్‌రెడ్డి, ఎంపీటీసీ గూడూరు బాలరాజు, కడవేర్గు ఉపసర్పంచ్‌ జల్లి రాజు, నేతలు కొమ్ముల స్వామి, పచ్చిమడ్ల సతీశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...