యోగాతో సంపూర్ణ ఆరోగ్యం


Sat,December 14, 2019 10:47 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి వ్యక్తి యోగా చేయాలని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ అన్నారు. శనివారం సిద్దిపేటలోని వి పంచి కళానిలయంలో రాష్ట్రస్థాయి యోగా పోటీలను ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, రఘోత్తండ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి జీవితంలో యోగా భాగం కావాలన్నారు. ఆరోగ్య సిద్దిపేటగా మార్చేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రతి పాఠశాలలో యోగా తరగతులు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారనితెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు యోగా చేసే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లోనూ విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చేలా స్వచ్ఛం ద సంస్థలు కృషి చేయాలని కోరారు. మొత్తం 175 దేశాల్లో యోగా ప్రాచుర్యంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసినప్పుడు ఆరోగ్యసిద్దిపేట సాధ్యమన్నారు. ప్రస్తుత జీవ న విధానంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉందని, ఒత్తిడి లేని జీవితానికి యోగాను దినచర్య లో భాగం చేసుకోవాలన్నారు. రాష్ట్రా నికే సిద్దిపేట ఆదర్శంగా నిలిచేలా కృ షి చేద్దామన్నారు.

ఎమ్మెల్సీలు ఫా రూఖ్‌హుస్సేన్, ర ఘోత్తండ్డి మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచే పిల్లలకు యోగాపై శిక్షణ ఇస్తే.. వారిని ఆరోగ్యవంతులుగా మార్చవచ్చన్నారు. వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సా ధ్యమన్నారు. ప్లాస్టిక్ రహిత సిద్దిపేట నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు అహర్నిషలు కృషి చేస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. కార్యక్షికమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ప్రెస్ అకాడమీ సభ్యుడు కొముర అంజ య్య, ఐవీఎప్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రిజి భూషణ్, జిల్లా సభ్యులు తోట సతీశ్, తోట అశోక్, దత్తావూతేయరావు, శ్రీనివాస్‌డ్డి, రామచంద్రం, సిద్ధ్దిరాములు, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, విక్రమ్‌డ్డి, హరివూపసాద్, రాము పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...