మంత్రి సమీక్షతో.. మున్సిపల్‌ భవనానికి మోక్షం


Fri,December 13, 2019 10:47 PM

హుస్నాబాద్‌ టౌన్‌: హుస్నాబాద్‌ పట్టణంలో నూతన మున్సిపల్‌ భవన నిర్మాణానికి సరైన స్థలాన్ని ఎంపిక చేసే విషయంలో ఏర్పడిన జాప్యం తొలిగించడంలో ఏర్పడిన నిర్లక్ష్యం ఎట్టకేలకు వీడిపోయింది. నిధులున్నా మున్సిపాలిటీకి పక్కా భవనాన్ని నిర్మించే విషయంలో అధికారుల అలక్ష్యంపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ ఐదు రోజుల క్రితం హుస్నాబాద్‌ మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి పనులు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు భవన నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు.

67.41లక్షతో భవన నిర్మాణం..
హుస్నాబాద్‌ పట్టణంలో నూతనంగా మున్సిపల్‌ భవన నిర్మాణాన్ని 2 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 67.41లక్షల రూపాయలతో నిర్మించేందుకు టెండర్‌ ఖరారు చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తు నిర్మించేందుకుగాను అంచనాలు రూపొందించి టెండర్‌ ఖరారు చేశారు. 2003లో హుస్నాబాద్‌ నగరపంచాయతీ ఉన్న సమయంలో నూతన భవన నిర్మాణానికి రూ. 50లక్షల నిధులు కేటాయించగా, 2017లో ఎస్‌ఎఫ్‌సీ కింద రూ. 17.41లక్షలు కేటాయించారు. పెరుగుతున్న హుస్నాబాద్‌ పట్టణానికి తోడు ప్రస్తుతం ఉన్న మున్సిపల్‌ భవనం సరిపోదని కొత్త భవనాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేసినప్పటికి సరైన స్థలాన్ని ఎంపిక చేయలేకపోవడంతో నిధులు బ్యాంకుల్లోనే మూల్గుతున్నాయి.

పట్టణంలోని కరీంనగర్‌ రహదారిలోని పలువురు భూ యజమానులు ఎకరం స్థలాన్ని మున్సిపల్‌ భవన నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు రావడంతోపాటు మున్సిపల్‌ అధికారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. అయితే టెండర్లు పిలిచే విషయంలో ఇంజినీరింగ్‌ అధికారుల జాప్యం, స్థానికంగానే ఉంచాలనే కొంత వివాదంతో భవన నిర్మాణం ముందుకు సాగలేదు. ఇటీవల హుస్నాబాద్‌ పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు పనులపై సమీక్ష జరిపి తక్షణమే పనులను నిర్వహించాలంటూ ఆదేశాలు జారీచేయడంతో బుధవారం ఇంజినీరింగ్‌ అధికారులు రూ. 67.41లక్షలతో ఖర్చుతో చేపట్టే భవన నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ దాఖలు చేసే అవకాశం కల్పించినట్లు మున్సిపల్‌ ఏఈ రంజిత్‌కుమార్‌ తెలిపారు. దీంతో భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...