ఇంటర్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి


Thu,December 12, 2019 11:20 PM

కోహెడ : ఇంటర్‌లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుధాకర్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఇష్టపడి చదువాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. 2020లో జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా చదివి మంచి ఫలితాలను సాధించాలన్నారు. కార్యక్షికమంలో కళాశాల ప్రిన్సిపాల్ గుర్రం రవీందర్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి రాజమౌళి, అధ్యాపకులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...