అత్యద్భుత అభివృద్ధికి అంకురార్పణ


Wed,December 11, 2019 04:15 AM

-నేడు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన
-గజ్వేల్‌లో భవనాల సముదాయం, మహతి ఆడిటోరియం ప్రారంభం
-ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల కూడా..
-గజ్వేల్‌లో రూ.వందకోట్లతో యూజీడీ నిర్మాణం, మాతాశిశుసంరక్షణ కేంద్రానికి శంకుస్థాపన
-సీఎం రాక కోసం పూర్తయిన ఏర్పాట్లు
-పరిశీలించిన మంత్రులు హరీశ్ రావు, నిరంజన్‌రెడ్డి
-ప్రజాప్రతినిధులు, అధికారులతో మహతిలో సీఎం సమావేశం
-విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతున్న భవనాలు
గజ్వేల్, నమస్తే తెలంగాణ: గజ్వేల్‌లో నేడు అభివృద్ధి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న అత్యద్భుత అభివృద్ధి పనులు ప్రజావినియోగంలోకి రానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ములుగులో అటవీ కళాశాల, ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం గజ్వేల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెడ్ యార్డ్, ఐవోసీ, ఆడిటోరియాన్ని ప్రారంభిస్తారు. అలాగే, రూ.100 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.32 కోట్లతో మాతా శిశు సంరక్షణ దవాఖాన పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక ఆడిటోరియంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేయగా, మంగళవారం మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ములుగు, గజ్వేల్‌లో పర్యటించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చూశారు.

గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. 2014 తర్వాత గజ్వేల్ నియోజకవర్గం ఊహించని విధంగా సమగ్రాభివృద్ధిలో మెరుపువేగంతో దూసుకెళ్తున్నది. కేసీఆర్ గజ్వేల్ నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించడంతో గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి. ఇంకా అనేక అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మహతి ఆడిటోరియాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారు. ఇప్పటికే ప్రారంభోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక నాయకులు ముఖ్యమంత్రి పర్యటన కోసం ఉత్సాహంగా ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పనులకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ముఖ్యమంత్రి పర్యటన కోసం ఉత్సాహంగా తమతమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సంబురంగా ఏర్పాట్లు
గజ్వేల్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి స్థానికులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టణవాసులు ఘన స్వాగతం పలుకనున్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, చికెన్, పూలదుకాణాలకు సంబంధించిన స్టాళ్లను కేటాయించడంతో వారివారి స్టాళ్లలో దుకాణాల ఏర్పాట్ల పనుల్లో లబ్ధిదారులు నిమగ్నమయ్యారు. మార్కెట్ భవనాన్ని అందంగా అలంకరించడమే కాకుండా అందమైన ప్రతిమలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా మూడు బ్లాకుల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు గదులను కేటాయించారు. కాంప్లెక్స్ ముందు ప్రారంభోత్సవం కోసం అందమైన శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహతి ఆడిటోరియంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇంకా రూ.100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మా ణం, రూ.32 కోట్లతో 100 పడకల మాతా శిశుసంక్షేమ దవాఖా నకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...