హెల్త్‌కార్డులు కలిగి ఉండాలి


Wed,December 11, 2019 04:08 AM

సిద్దిపేట రూరల్: సీఆర్‌ఎస్‌డీ, పీఎంసీ, ఐఆర్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట మండల పరిషత్ కార్యాలయంలో బీడీ కార్మికులతో ప్రభుత్వ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీడీ కార్మికుల దవాఖాన వైద్యాధికారి సంధ్య, ఈపీఎఫ్ అధికారి కొండల్‌రావు, ఐఆర్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొండ్ర రాజలింగం పాల్గొని మాట్లాడారు. బీడీ కార్మికులు తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు హెల్త్ కార్డు కలిగి ఉండి బీడీ కార్మికుల వైద్యశాల సేవలను పొందాలన్నారు. హెల్త్‌కార్డు లేనివారు పీఎఫ్ వివరాలు అందజేసి హెల్త్‌కార్డు పొందాలన్నారు. పీఎఫ్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలన్నారు. బీడీ కార్మికులు ఇతర ఉపాధి మార్గాలు పొందాలంటే ఆంధ్రాబ్యాంక్ ఇస్తున్న శిక్షణా కార్యక్రమం ద్వారా మెరుగైన జీవనోపాధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు ప్రతినిధి నజీమ్, సీఆర్‌ఎస్‌డీ ప్రతినిధి ఉమ, ఐఆర్‌డీఎస్ కో-ఆర్డినేటర్ బాలకృష్ణ, 10 గ్రామాల బీడీ కార్మికులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...