జోరుగా ధాన్యం కొనుగోళ్లు


Wed,December 11, 2019 04:08 AM

రాయపోల్ : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరను అందించడంతో పాటు దళారుల నుంచి రైతులను కాపాడాలని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వానకాలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే మండలంలోని రాయపోల్, రాంసాగర్, వడ్డేపల్లి, తిమ్మక్కపల్లి, గొల్లపల్లి, ఎల్కల్, కొత్తపల్లి, అనాజీపూర్ గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అందుకు అనుకూలంగా సరిపడా గన్నీ బ్యాగులను ప్రభుత్వం సరఫరా చేయడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యన్ని మిల్లర్లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మండలంలో ఇప్పటి వరకు 200 మంది రైతుల ద్వారా ఎనిమిది వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పారదర్శకతను పాటించేందుకు రైతుల ఆధార్‌కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాసుపుస్తకంతో వీఆర్వో ధ్రువీకరించిన పత్రాన్ని పరిశీలించిన అనంతరం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేస్తున్నారు. గతంలో ఎప్పడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతుండడంతో దళారుల ఇష్టారాజ్యాలకు కొనుగోలు కేంద్రాలతో చెక్ పెట్టినట్లయింది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...