విద్యార్థులు పట్టుదలతో అభ్యసించాలి


Wed,December 11, 2019 04:08 AM

మిరుదొడ్డి : విద్యార్థులు చిన్న తనం నుంచి పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని భూంపల్లి జడ్పీ పాఠశాలలో వాటర్ బెల్‌ను ప్రారంభించి 159 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బడులకు దీటుగా సర్కార్ బడుల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు సకల వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. విద్యార్థులు సరిపడా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి వ్యాధులు దరి చేరవని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బక్కి భాగ్యమ్మ, ఎంపీటీసీ ఉమారాణి, ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్, ఉప సర్పంచ్ ప్రభాకర్, టీఆర్‌ఎస్ నేతలు, వార్డు సభ్యులు, ఎస్‌ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...