‘ఎర్రవల్లి బహుత్‌ అచ్ఛాహై.. బహుత్‌ సుందర్‌ హై..’


Mon,December 9, 2019 10:53 PM

-జార్ఖండ్‌ సీఎం ముఖ్య కార్యదర్శి సునీల్‌ కుమార్‌ కితాబు
-ఎర్రవల్లి, సంగాపూర్‌, ప్రజ్ఞాపూర్‌, కోమటిబండలో ‘భగీరథ’ పరిశీలన
-దేశానికి సరికొత్త దిక్సూచి మిషన్‌ భగీరథ అని వ్యాఖ్య
-ఈ గొప్పతనం తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ
సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో అభివృద్ధి పనులు, పథకాలు, గ్రామస్తుల ఐక్యత బాగున్నదని జార్ఖండ్‌ సీఎం ముఖ్య కార్యదర్శి సునీల్‌ కుమార్‌ బర్నవాల్‌ ఖితాబిచ్చారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో కలియతిరుగుతూ కనీస వసతులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో జరిగిన పలు అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్‌ భాగ్యభిక్షపతి ఆయనకు వివరించారు. ‘ఎర్రవల్లి బహుత్‌ అచ్ఛాయే.. బహుత్‌ సుందర్‌ హై..’ అంటూ ఖితాబిచ్చారు. అలాగే మిషన్‌ భగీరథ విధానం చాలా బ్రహ్మండంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే సోలార్‌ సిస్టం విధానం బాగుందని చెప్పారు. ఇండ్ల మధ్యలో మొక్కల పెంపకం, పిల్లల పార్కు, గ్రామంలో హైమాస్ట్‌ లైట్లు చూసి చాలా బాగుందని చెప్పారు. ఎర్రవల్లి అభివృద్ధికి చిరునామా అని పేర్కొన్నారు. ఇక్కడ అభివృద్ధి విధానం తమ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...