ఎంజీయూ బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపిక


Thu,December 5, 2019 12:55 AM

నల్లగొండ విద్యావిభాగం : మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంటర్‌ పురుషుల బాస్కెట్‌బాల్‌ జట్టు (2019-20)ని బుధవారం ఎంపిక చేశారు. ఇటీవల ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని జట్టుకు ఎంపిక చేసినట్లు ఎంజీయూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శి డా. జి.ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఎంపిక పోటీలను ఎంజీయూ పీడీలు ఆర్‌.మురళి, డా. వై. శ్రీనివాసరెడ్డి తదితరులు పర్యవేక్షించారు


ఎంపికైన క్రీడాకారులు వీరే...
బి. వంశీ, కె. జమీర్‌, ఎం.రాజేశ్‌, ఎం. యశ్వంత్‌-ఎన్జీ కళాశాల నల్లగొండ, కె. శ్రవణ్‌కుమార్‌, ఆర్‌.శ్రీకాంత్‌, ఎం. బీరప్ప-ఎంఎంఆర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల, చౌటుప్పల్‌, పి.సంతోశ్‌, బి. భానుప్రకాశ్‌, ఎస్‌కే. రియాజ్‌, ఎల్‌. వినయ్‌కుమార్‌-ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కళాశాల భువనగిరి, ఎస్‌. సతీశ్‌-శ్రీకృష్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (హాలియా)లను ఎంపిక చేశారు. అదే విధంగా స్టాండ్‌ బైలో వి. విక్రమ్‌-ఎస్వీ డిగ్రీ కళాశాల సూర్యాపేట, పి. మల్లికార్జున్‌-జీకేసీపీఈ హాలియా, ఎల్‌. వరుణ్‌-ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ భువనగిరి ఉన్నారు. వీరిని త్వరలో జాతీయస్థాయి పోటీలకు పంపనున్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...