యాదాద్రిలో నిత్యపూజల కోలాహలం


Thu,December 5, 2019 12:54 AMయాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్యపూజల కోలాహలం నెలకొంది. బుధవారం వేకువజామున స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్యమనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతోపాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

సాయంత్రం అలంకారజోడు సేవలు నిర్వహించారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతపూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.32,000ఆదాయం సమకూరింది.

శ్రీవారి ఖజానాకు రూ.5,12,866 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.5,12,866 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.79,698, రూ. 100ల దర్శనంతో రూ.26,000, కల్యాణకట్ట ద్వారా రూ.9,200 వ్రతపూజల ద్వారా రూ.32,000, ప్రసాద విక్రయాలతో రూ. 2,17,575, శాశ్వత పూజల ద్వారా రూ.13,116, టోల్‌గేట్‌ ద్వారా రూ. 830, అన్నప్రసాదంతో రూ.6,386, వాహనపూజల ద్వారా రూ.6,400, ఇతర విభాగాలతో రూ.8,241లతో కలిపి ఖజానాకు రూ. 5,12,866 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...