అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు


Thu,December 5, 2019 12:53 AM

-రూ.28 లక్షల విలువ చేసే ఆభరణాలు, బైక్‌ స్వాధీనం
-వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

నల్లగొండ సిటీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను గు ర్తించి చోరీలకు పాల్పడుతున్న దొంగను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని మంచిర్యాల జిల్లా మందమర్రి మం.పొన్నారం గ్రామానికి చెందిన ఎలక్ట్రానిక్‌ దాసరి విజయ్‌ అలియాస్‌ చరణ్‌ అలియాస్‌ నాని రెండు తెలుగు రా ష్ర్టాల్లోని పలు పట్టణాల్లో సంచరిస్తు తాళం వేసిన ఇళ్లు గుర్తించి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు.చోరీ చేసిన సొత్తును నర్సరావుపేట, పిడుగురాళ్లలో ఉన్న మణప్పురం, ముత్తూట్‌ పైనాన్స్‌లలో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారన్నారు. నల్లగొండలో గత నెలలో హైదరాబాద్‌రోడ్డులోని ఒక ఇంట్లో కిచెన్‌ రూమ్‌, బెడం విరగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేశాడన్నారు.

తిరిగి మరల నల్లగొండలో చోరీకి పాల్పడేందుకు మంగళవారం బైక్‌పై వస్తుండగా పానగల్‌ ఇందిరాగాంధీ బొమ్మ వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చి ప ట్టుకుని విచారించారు. దీంతో చోరీలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. నిందితుడిని నుంచి రూ. 8 లక్షల విలువ చేసే 25 తులాల బంగారు ఆభరణాలు, కొంత వెండి, రూ.5 వేల నగదు, సెల్‌ఫోన్‌, బైక్‌లను సీజ్‌ చేసినట్లు తెలిపారు. నల్లగొండతో పాటు మిర్యాలగూడ, కోదాడ, ఏపీలోని గూ డూర్‌, రేణిగుంట, నర్సారావుపేట, వేటాయిపా లెం, ఒంగోలు, చీరాల ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు.

గతంలో 27 కేసుల్లో జైలుకు పోయి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బ యటకు వచ్చి మరల చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. తాకట్టు పెట్టిన ఆభరణాలను ఆయా ఫైనాన్స్‌ల నుంచి స్వాధీనం చేసుకోవడం చేసుకున్నట్లు చె ప్పారు. విజయ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్‌, టూటౌన్‌ పోలీసులను డీఎస్పీ శాలువాతో సత్కరించి రివార్డుతో పాటు నగదు అందజేశారు. సమావేశంలో సీసీఎస్‌ సీఐ బాలస్వామి, టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింహులు, సీసీఎస్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌, రైటర్లు మోహన్‌రెడ్డి, నర్సింహరావు, సీసీఎస్‌, టూటౌన్‌ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

18
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...