ప్రతి చెరువునూ నింపుతాం


Thu,December 5, 2019 12:53 AM

-డిండి ప్రాజెక్టు కింద రెండు పంటలకూ నీరు
-మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేయాలి
-వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

డిండి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం రాష్ట్రంలోని ప్రతి చెరువునూ కృష్ణా, గోదావరి నీటితో నింపుతామని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్ర వ్యవసాయానికి నీటివసతి ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వైవిధ్య భూములు ఉన్న మన రాష్ట్రంలో వైవిధ్యమైన పంటలు పండించేందుకు అవకాశం ఉన్నదని రాష్ట్ర అవసరాలకే కాకుండా పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు సీఎం ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి ప్రాజెక్టు నిర్మాణంతోపాటు రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీతోపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా సరాసరిన రూ.80 వేలు ప్రభుత్వం నుంచి సహాయం అందుతున్నట్లు తెలిపారు.

రైతులు సంప్రదాయ పద్ధతులతో కాకుండా అధిక దిగుబడులు సాధించేందుకు సాంకేతిక విధానాలు పాటించాలని సూచించారు. అందరూ ఒకే పంట వేయకుండా మార్కెట్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాటల సాగు చేయాలని తెలిపారు. డిండి వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రానికి శాశ్వత నీటివసతి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిండి ఫామ్‌లో ఉన్న 176ఎకరాలలో నుండి రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించేందుకు కావాల్సిన ఫైండేషన్‌ షీడ్‌ అభివృద్ధికోసం డిండి ఫామ్‌లోని 30ఎకరాలు రాష్ట్ర సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌కు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హార్టికల్చర్‌ అధికారులతో మాట్లాడి ఫామ్‌ చుట్టూ బార్డర్‌లో టేకు, శ్రీగంధం, వెదురు, కొబ్బరి లాంటి చెట్లు నాటి అహ్లాదాన్ని పెంపొందించేలా హరిత వనం ఏర్పాటుచేస్తామన్నారు. భవిష్యత్తులో ఈ ఫామ్‌ను మోడల్‌ఫామ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా డిండి ఫామ్‌ నిరాదరణకు గురైందని ఇది మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లా సరిహద్దులో ఉన్నదని రెండు జిల్లాల రైతుల అవసరాలు తీర్చే విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

డిండిలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రిని కోరగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలతో పెరుగుతున్న సాగు విస్తీర్ణంతో పాటుశాస్త్ర సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుందని, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి కళాశాల ఏర్పాటుకు కృషిచేస్త్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కోటేశ్వరరావు, జేడీఏ బాలూనాయక్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రంచందర్‌నాయక్‌, జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ విజేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాదవరం దేవేందర్‌రావు, ఎంపీపీ మాధవరం సునీతజనార్ధన్‌రావు, వైస్‌ ఎంపీపీ పుల్లమ్మ, రైతు సమన్వయసమితి మండల కన్వీనర్‌ వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ సాయమ్మకాశన్న, ఉపసర్పంచ్‌ నూకం వెంకటేష్‌, ఎంపీటీసీలు శ్రీలత, రాధిక, వెంకటయ్య, ఏఓలు లక్పతినాయక్‌, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...