క్రీడాస్ఫూర్తిని చాటాలి


Sun,November 17, 2019 11:15 PM

-ఇన్‌స్పెక్టర్ జనరల్ సైదయ్య
-గౌరారంలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల్లో రాష్ట్రస్థాయి పోటీలు
వర్గల్ : విద్యార్థులు క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని ఇన్‌స్పెక్టర్ జనరల్ సైదయ్య తెలిపారు. మండలం లోని గౌరారం జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల్లో రాష్ట్రస్థాయి 6వ క్రీడాపోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ.. ఆటలో ఒకరు ఓడడం, మరొకరు గెలుస్తారని, రెండింటిని సమానంగా స్వీకరించాలన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో గురకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు, డైరెక్టర్ రమేశ్, ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, పీఈటీ సంధ్య ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...