మహా కుంభాభిషేకం


Sun,November 17, 2019 11:13 PM

కొమురవెల్లి : మల్లన్న క్షేత్రంలో సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయ వర్గా లు అన్నిఏర్పాట్లు పూర్తి చేశాయి. క్షేత్ర రాజగోపురానికి 12ఏండ్లు కావస్తున్నందున 5 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. వీరశైవ జగద్గురువు 1008 పీఠాధిపతి ఉజ్జయని సద్దర్మ సింహాసనాధీశ్వర సిద్దలింగం రాజదేశి కేంద్ర శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు. సోమవారం మల్లన్న స్వామికి నిత్యార్చణ, మంగళ వాయిద్య పూర్వక అగ్రోదకం, గోపూజ, మహాగణపతి పూజ, వైదిక స్వస్తి పు ణ్యాహవాచణం, రక్షాబంధనం, మృత్ సంగ్రహణం, పంచగవ్యప్రాశణం, ఋత్విక్ వరణం, అఖండ దీపస్థ్ధాపన, యాగశాల సంస్కరణ, యాగశాల ప్రవేశం, తోరణ పూజ, షోడశస్థంభ పూజ, నాందీసమారాధణ, అంకురారోపణ, పంచకలశ స్థాపన, నవగ్రహ, వాస్తు క్షేత్ర పాలక, మాతృకామండలి పూజ, యోగినీ మండల, సర్తోభద్ర మండ ల, చతుర్ లింగతోభద్రమండల పూజ, ప్రధాన కలశ స్థాపన, అర్చన, ఆరాధనలు, శైవాగ్నిముఖ ప్రతిష్ట, అవాహిత మంటప స్వాకార హో మం, అర్చన, అభిషేకం, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్ధప్రసాద వితరణ నిర్వహించనున్నారు. ఈ నెల 22న జరిగే పూజలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జనగా మ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శాస న మండలి చీఫ్‌విప్ బొ డెకుంటి వెంకటేశ్వర్లు, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...