హోరాహోరీగా సాఫ్ట్‌బాల్ పోటీలు


Sun,November 17, 2019 11:13 PM

- కొండపాకలో రాష్ట్రస్థాయి క్రీడలు
- ఆటలను ప్రారంభించిన జడ్పీటీసీ అశ్విని
- ఫైనల్‌కు చేరిన మెదక్, నిజామాబాద్ జట్లు
కొండపాక : మండలకేంద్రం కొండపాకలోని వేద ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అండర్-14 (బాలికలు)లో రెండోరోజు ఆదివారం పాత 9 జిల్లాల నుంచి వచ్చిన 144 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. జడ్పీటీసీ అనంతుల అశ్విని హైదరాబాద్, ఆదిలాబాద్ జట్ల మ్యాచ్‌ను ప్రారంభింంచారు.

* లీగ్ పద్ధతిలో పోటీలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు 9 జట్లను రెండు భాగాలుగా చేసి, లీగ్ పద్ధ్దతిలో పోటీలను నిర్వహించారు. ఏ గ్రూపు లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల జట్లు, బీ గ్రూపులో మెదక్, హైదరాబాద్, నల్గొం డ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు మిగతా నాలుగు జట్లతో ఆడాలి. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లను సెమీ ఫైనల్స్‌కు ఎంపిక చేశారు. ఏ -విభాగం నుంచి నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల జట్లు, బీ- విభాగం నుంచి మెదక్, వరంగల్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో నిజమాబాద్, వరంగల్ జిల్లాల జట్లు తలపడగా 10 పాయింట్లు ఆధిక్యంతో నిజామాబాద్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మరో గ్రూప్‌లో మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల జట్లు తలపడగా 12 పాయింట్లతో మెదక్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌కు చేరుకున్న మెదక్, నిజామాబాద్ జిల్లాల జట్ల మద్య సోమవారం ఫైనల్ మ్యాచ్ జరుతున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి భిక్షపతి తెలిపారు.

* అంతర్జాతీయస్థాయికి చేరాలి : జడ్పీటీసీ అశ్విని
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగాలని జడ్పీటీసీ అనంతుల అశ్విని అన్నారు. సాఫ్ట్‌బాల్ పోటీలను సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు మానసికం గా, శారీరకంగా దృఢంగా ఎదగడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జల్లా కార్యదర్శి భిక్షపతి, రాష్ట్ర పరిశీలకుడు నాగరాజు, మెదక్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి శాం సుందర్‌శర్మ, పీఈటీ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట సతీశ్, ప్రధాన కార్యదర్శి హరికిషన్, ఫిజికల్ డైరెక్టర్లు చిలుముల మురళీధర్, భాస్కర్‌రెడ్డి, విజయ్‌కృష్ణ, వ్యాయామ ఉపాధ్యా యులు బాబు, గంగ, మోహన్, రేణుక, పద్మ ఉన్నారు.
పుష్కరకాలం..

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...