మహా కుంభాభిషేకానికి వేళాయె


Sat,November 16, 2019 11:21 PM

-మల్లన్న క్షేత్రంలో ఐదురోజులపాటు నిర్వహణ
-రేపట్నుంచి పూజలు ప్రారంభం
-ఆలయానికి చేరిన ఐదు నదుల జలాలు
చేర్యాల,నమస్తేతెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రంలో మహా కుంభాభిషే కం నిర్వహించేందుకు ఆలయవర్గాలు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ రాజగోపురం,శిఖరాలు ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా వీరశైవ ఆగమశాస్త్ర నిబంధనల మేరకు కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజులపా టు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్ణాటక ఉజ్జయిని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 జగద్గురువు సిద్దిలింగరాజా దేవీకేంద్ర శివాచార్య స్వామిజీ ఈనెల 21వ రాత్రికి కొమురవెల్లికి చేరుకొని 22న నిర్వహించే పూజల్లో పాల్గొననున్నారు.
స్వామి వారి సన్నిధిలో పవిత్ర నదుల జలాలు
దేశంలోని 5 పవిత్ర నదులైన గంగా, కావేరి, గోదావరి, కృష్ణ, తుంగభద్రలకు చెందిన జలాలను ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్ కాశీ(గంగా), కర్ణాటక(కావేరి), కాళేశ్వరం(గోదావరి), విజయవాడ(కృష్ణ), మహబూబ్‌నగర్(తుంగభద్ర)లకు అర్చకులను పంపించి ప్రత్యేక వాహనాల్లో తెప్పించారు. వీరశైవ ఆగమశాస్ర్తాన్ని అనుసరించి ప్రతి పుష్కర కాలానికి ఒకసారి కలశాలకు అభిషేకం నిర్వహించాల్సి ఉండడంతో మహాకుంభాభిషేకానికి ఆలయవర్గాలు శ్రీకారం చుట్టాయి. ఆలయంలో కుంభాభిషేకం పూజ తదితర కార్యక్రమాలు ఉజ్జయని పీఠాధిపతి సూచనలు, ఆదేశాలతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 రోజులపాటు సహస్ర ఘటాభిషేకం, చండీహోమం, రుద్రహోమం, సహస్ర లింగార్చన తదితర ప్రత్యేక పూజలు జరగనున్నాయి.
పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు
5 రోజులు సాగే పూజా కార్యక్రమాలకు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, భక్తులు రానున్నారు. పూజల కోసం గంగరేగు చెట్టు ప్రాంగణంలో యాగశాల, హోమగుండాలను నిర్మించారు. రాజగోపురానికి రంగులు వేయడంతోపాటు గోపురం పైభాగంలోని శిఖరాలను శుద్ధిచేసి రంగులు వేసి పూజల నిర్వహించేలా తాత్కాలిక మెట్లను ఏర్పాటు చేశారు.
క్రీడా సంబురం
కొండపాక : కొండపాకలోని వేద ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్-14 బాలికల సాఫ్ట్‌బాల్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఖమ్మం జిల్లా మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల నుంచి 144మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను క్రీడా జ్యోతి వెలిగించి, జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వేద ఇంటర్నేషనల్‌సూకల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు నిర్వాహకులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సాఫ్ట్‌బాల్ కొత్త ఆట కావడంతో పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా చూశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి రమేశ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి భిక్షపతి, వైస్ ఎంపీపీ దేవీరవీందర్, తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, విజయకృష్ణ, మురళీధర్, శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు తోట సతీశ్, హరికిషన్, రాంనర్సయ్య, వేద ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట క్రీడారంగానికి పెట్టింది పేరు
క్రీడారంగంలో రాణించే క్రీడాకారులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. రాష్ట్రస్థా యి సాఫ్ట్‌బాల్ పోటీల సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభు త్వం క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదన్నారు. ము ఖ్యంగా జిల్లా విద్యార్థులు క్రీడారంగంలో రాణించి, జాతీయస్థాయిలో కీర్తి ప్రతిష్టలను అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ప్రత్యే క, నూతన కార్యక్రమమైనా సిద్దిపేట నుంచే ప్రారంభం కావడం మరో విశిష్టత అన్నారు. సిద్దిపేట జిల్లాలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడలు తరుచూ జరుగుతూ క్రీడలకు సిద్దిపేట కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అన్నారు. ఆడపిల్లలు అన్న తేలిక భావన లేకుండా బాలకలను శ్రమకు ఓర్చి, దూర ప్రాంతాల నుంచి రాష్ట్రస్థాయి క్రీడలకు పంపిన తల్లిదండ్రులను అభినందించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...