చెడు వ్యసనాలతో అధోగతి


Sat,November 16, 2019 11:18 PM

- దొంగగా మారిన జూనియర్ ఆర్టిస్టు
- ఉదయం రెక్కి.. రాత్రి దొంగతనాలు
- సిద్దిపేట, గజ్వేల్‌లో 21 చోరీలు
- అరెస్టు చేసిన పోలీసులు
- రూ.14 లక్షల సొత్తు రికవరీ
- మీడియాతో సీపీ జోయల్ డెవిస్
సిద్దిపేట టౌన్ : చెడు వ్యసనాలకు బానిసై.. జూనియర్ సినీ ఆర్టిస్టు ఘరాన దొంగగా మారాడు. ఉద యం రెక్కి.. రాత్రి వేళ దొంగతనాలు చేస్తూ సిద్దిపేట, గజ్వేల్‌లో ప్రజలను భయాందోళనలు పుట్టించాడు. ఏకంగా 21 దొంగతనాలు చేశాడు. పోలీసులు ప్ర త్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి దొంగను పట్టుకున్నారు. అతడి నుంచి రూ.14లక్షల సొత్తును రికవరీ చేశారు. ఈ మేరకు శనివారం పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ కేసు వివరాలు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా రూపునారాయణపేట గ్రామానికి చెందిన ఐలవేని రామకృష్ణ అలియాస్ జంపయ్య జూనియర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం హైదరాబాద్ మూసాపేటలో నివాసముంటున్నాడు. అయితే, చెడు వ్యసనాలైన రేసింగ్, జూ దం, తాగుడుకు బానిసయ్యాడు. వచ్చిన డబ్బులు సరిపోక దొంగతనాలు చేసి సంపాదించాలని పథకం పన్నాడు. 2005 సంవత్సరంలో సుబేదార్ పోలీసు స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనానికి పాల్పడ్డాడు. నాటి నుంచి దొంగగా మారిన రామకృష్ణ.. హన్మకొండ, ఖాజీపేట, కరీంనగర్, సంగారెడ్డి, చైతన్యపురి, ఎల్బీనగర్, హైదరాబాద్‌లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో జైలుకు వెళ్లి శిక్ష కూడా అనుభవించాడు. తిరిగి జైలు నుంచి బయటకు వచ్చి తన పంథా కొనసాగించాడు. రామకృష్ణ.. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో ఇంటి తాళాలు పగులగొట్టి 21 దొంగతనాలకు పాల్పడ్డాడు.

* ఉదయం రెక్కి..
హైదరాబాద్ ముసాపేట నుంచి రోజువారీగా బస్సులో వచ్చి ఎవరికి అనుమానం రాకుండా సిద్దిపేట, గజ్వేల్‌లో ఉదయం పూట రెక్కి నిర్వహించేవాడు. ఇంటి తాళాలు ఉన్న వాటిని పరిశీలించి రాత్రి వేళ సెకండ్ షో సినిమాకు వెళ్లి.. రెక్కి నిర్వహించిన కాలనీలో చోరీలకు పాల్పడేవాడు. తిరిగి అదే రాత్రి బస్సులో ముసాపేటకు వెళ్లేవాడు. సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో 13 దొంగతనాలకు పాల్పడ్డాడు. గజ్వేల్ లో 8 ఇండ్లను దోచాడు. సిద్దిపేటలో 18.5 తులాల బంగారు అభరణాలు, 30 తులాల వెండి, 20 వేల నగదు, కెమెరా, వాచ్, గజ్వేల్‌లో 12 తులాల బం గారు అభరణాలు, 20 తులాల వెండి, లక్ష రూపాయల నగదు, మద్యం బాటిళ్లను దొంగిలించాడు.
* పట్టుబడిందిలా....
సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో భారీ చోరీలకు పాల్పడిన నిందితుడు రామకృష్ణను పట్టుకునేందుకు అడిషినల్ డీసీపీ నర్సింహారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. నిందితుడిపై ప్రత్యేక నిఘా పెట్టా రు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి అనవాళ్లను పసిగట్టారు. ఈ నెల 14న గజ్వేల్‌లో దొంగతనం చేద్దామని ఇండ్లను వెతికాడు. ఎక్కడా కూడా తాళం వేసిన ఇండ్లు కనిపించకపోవడంతో ప్రజ్ఞాపూర్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు నేరస్తుడు టీ తాగు తూ క్రైమ్ పార్టీ పోలీసులకు కనబడ్డాడు. పోలీసులను చూసి రామకృష్ణ తడబడ్డాడు. దీంతో అతడి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా చెక్ చేశారు. దీంతో పాత నేరస్తుడిగా రామకృష్ణను గుర్తించిన పోలీసులు.. పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేశా రు. గజ్వేల్, సిద్దిపేటలో దొం గతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడి వద్ద నుంచి చోరీలకు ఉపయోగించిన సీబీజడ్ ద్విచక్ర వాహనాన్ని, ఐరన్ రాడ్, ఫోన్, బంగారు ఆభరణాలు స్వా ధీనం చేసుకున్నారు.
* పోలీసులకు రివార్డులు
చోరీ కేసు ఛేదించడంలో సిద్దిపేట అడిషినల్ డీసీపీ నర్సింహారెడ్డి, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, సిద్దిపేట వన్‌టౌన్ సీఐ సైదులు, గజ్వేల్ ఏసీపీ నారాయణ, గజ్వేల్ సీఐ ప్రసాద్, దౌల్తాబాద్ ఎస్‌ఐ చంద్రశేఖర్, క్రైమ్ పార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఘరాన దొంగ రామకృష్ణను పట్టుకున్న పోలీసులకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డెవిస్.. అభినం దించి, రివార్డులను అందజేసి ప్రశంసించారు.
* 37 మంది నేరస్తుల అరెస్టు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెల రోజుల్లోనే హుస్నాబాద్, గజ్వేల్, సిద్దిపేట డివిజన్లలో చోరీలకు పాల్పడిన 37 మంది నేరస్తులను అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ వివరిం చారు. మొత్తం 21 కేసులను చేధించామన్నారు. హుస్నాబాద్ డివిజన్‌లో 9, గజ్వేల్ పట్టణంలో 1, సిద్దిపేట డివిజన్‌లో 11 కేసులు పోలీసులు చేధించారని చెప్పారు. 44 లక్షల 2 వేల రూపాయల సొత్తు అపహరణకు గురికాగా 36 లక్షల 66 వేల 500 రూ పాయల విలువ గల సొత్తును రికవరీ చేశామన్నారు. నేరాలను ఉక్కుపాదంతోఅణిచివేస్తామని చెప్పారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...