రైతుల శ్రేయస్సే సీఎం కేసీఆర్ లక్ష్యం


Sat,November 16, 2019 11:18 PM

గజ్వేల్ రూరల్ : రాష్ట్రంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని.. అటవీశాఖ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో సెర్ప్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా ఇవ్వడంతోపాటు పండించిన పంటలకు సరైన ధర చెల్లించడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులంతా గజ్వేల్‌కు ధాన్యాన్ని తీసుకువెళ్లి విక్రయించడానికి ఇబ్బంది కలుగుతుందని, అలాంటివారు అహ్మదీపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తెస్తే సరైన నాణ్యత ఉం టుందని, నాణ్యతను బట్టే మద్దతు ధర చెల్లి స్తారని తెలిపారు. రైతులు ధాన్యం విక్రయాల్లో జా గ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ అమరావతి శ్యాంమనోహర్, జడ్పీటీసీ మల్లేశం, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, సర్పంచ్ నవీనాశ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల సభ్యుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటనర్సింహారెడ్డి, ఏవో నాగరాజు, ఏపీఎం యాదగిరి, సీనియర్ నా యకులు మాదాసు శ్రీనివాస్, జిల్లా నాయకుడు పండరి రవీందర్‌రావు, మండల అధ్యక్షుడు బెండ మధు, నాయకులు చాడ కిరణ్‌కుమార్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...