అభివృద్ధి, సంక్షేమంలోమనమే టాప్


Sat,November 16, 2019 11:17 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎ స్ ప్రభుత్వం పనిచేస్తున్నది.. సబ్బండ వర్గాల సం తోషాన్ని కేసీఆర్ కోరుకుంటున్నారు.. పేదోడు గొ ప్పగా బతకాలని ఆకాంక్షిస్తున్నారు.. అందుకుగుణంగానే అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారు.. అ ని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజ్ఞాపూర్‌లోని హరిత హోటల్లో శనివారం ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నారన్నారు. రాష్ట్రంలో అ భివృద్ధి సంక్షేమం సమాంతరంగా పరుగులు తీస్తున్నదని, ఈ అంశాలతో దేశంలో మనమే ముందున్నామని మంత్రి పేర్కొన్నారు.

రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్‌తో పాటు మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు లాంటి అనేక ప థకాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నా రు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం పచ్చదనంతో సస్యశ్యామలం కావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాట్లు తెలిపారు. 2014 తర్వాత స్వరాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తున్నదని మంత్రి తలసాని అన్నారు. బతుకమ్మ పండగను విశ్వవ్యాప్తం చేయడం తో తెలంగాణ ఔన్నత్యం నలు దిశలా ఖ్యాతి గడించిదన్నా రు. రంజాన్, క్రిస్మస్, బోనాల పండుగలను సం తోషంగా రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్నా రు. రాష్ట్రంలో మొదటి సారి రోయ్యల పెంపకం చేపడుతున్నామని 7 కోట్ల రోయ్య విత్తనాన్ని 42 రిజర్వాయర్లలో వదులుతున్నట్లు తెలిపారు. ఇం కా చేనేత, గౌడ కార్మికులకు, పాడి, గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదన్నారు.

మనదే ఆరోగ్యకరమైన ప్రాంతం
ఆరోగ్యకరమైన వాతావరణ రాష్ట్రంగా మార్చడానికి 2014 నుంచి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారన్నారు. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ కొత్త చట్టాల ద్వారా 30 రోజుల ప్రణాళిక రాష్ట్రంలో ఆరోగ్యకరమైన వాతావరణం అందించడానికి ప్రజలను చైతన్యవంతం చేసిందన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. భూంరెడ్డి, ఎంపీపీ అమారవతి, జడ్పీటీసీ బాలమల్లు, టీఆర్‌ఎస్వీ నాయకులు మాదాసు శ్రీనివాస్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, బెండమధు, ర్యాగల్ల దుర్గయ్య, గోపాల్ రెడ్డి, దుర్గాప్రసాద్, నర్సింలు, మెట్టయ్య, నవాజ్‌మీరా, మతీన్, రాజ్‌కుమార్, రఘుపతిరావు, పరమేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...