ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..


Sat,November 16, 2019 11:17 PM

సిద్దిపేట అర్బన్ : ఇంటింటికీ మిషన్‌భగీరథ ద్వారా శుద్ధజలం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామంలో జిల్లాలోని మిషన్ భగీరథ ఇంజినీర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోలర్ ఎగ్జిక్కూచటీవ్ ఇంజినీర్ రామ్మోహన్‌రావుతో కలిసి ఆమె మాట్లాడారు. ఇంటింటికి తాగు నీరు అందించే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మిషన్ భగీరథ శుద్ధనీటి విషయంలో ప్రజలందరినీ చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మిషన్‌భగీరథ ద్వారా వచ్చే నీటిని తాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరినది నీటిని ప్రజలు తాగడానికి అందించాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం పైపులద్వారా నీటిని గ్రామ గ్రామానికి అందిస్తున్నదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో మిషన్ భగీరథ నల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ నీటి పైపులు ఏర్పాటు చేసే ప్రక్రియ, నీటి ట్యాంకులు నిర్మించే విధానం.. వాటికి వేయాల్సిన రంగులు.. లీకేజీ కాకుండా ఉండేందుకు తీసుకునే చర్యలు.. నల్లాలు బిగింపులో జాగ్రత్తలు.. ఇంజినీర్ల విధివిధానాలు.. ప్రజలతో భాగస్వామ్యం అయి వారిని చైతన్యపర్చడం.. వంటి అంశాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం సర్పంచ్ ఐరేణిజయశ్రీరమేశ్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. మిషన్‌భగీరథ నీటి వినియోగం తీరు తెన్నులను పరిశీలించారు. ఇందుకు కృషి చేస్తున్న అధికారులను ఏసీ శ్రీనివాసచారి, డీఈ నాగభూషణంను అభినందించారు. ఎల్లుపల్లిలో పర్యటిస్తున్న క్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగి చూశారు. అలాగే ఎల్లుపల్లి గ్రామాన్ని ఆహ్లాదభరితంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్‌ను అభినందించారు. అనంతరం నంగునూరు మండలం జేపీ తండా, సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామాల్లో మిషన్‌భగీరథ ఇంజినీర్ల బృందం పర్యటించి, గ్రామాల్లో అమలవుతున్న తాగునీటి సరఫరా విధానంపై ప్రజలతో మాట్లాడారు. నాంచారుపల్లి పాఠశాలలో, అంగన్వాడీ సెంటర్‌లో తాగు నిటి పరీక్షలు చేశారు. సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాంచారుపల్లి సర్పంచ్ కొన్నెకల్పన నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...