పాతాళగంగ.. పైపైకి


Fri,November 15, 2019 11:07 PM

-జిల్లాలో పెరిగిన భూగర్భజలాలు
-సెప్టెంబర్, అక్టోబర్‌లో విస్తారంగా వానలు
-బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు
-11.48 మీటర్ల దిగువున జలాలు
-కొమురవెల్లిలో 1.47 మీటర్ల లోతులో.. ముబారస్‌పూర్‌లో 30.03 మీటర్ల లోతున జలం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఆలస్యంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఇటీవల భూగర్భ జలవనరుల శాఖ చేసిన సర్వేతో జిల్లాలో సరాసరి 11.48 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం ఉంది. కొమురవెల్లిలో 1.47 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా, దౌల్తాబాద్ మండలం ముబారస్‌పూర్‌లో 30.03 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల్లో పైపైకి ఉబికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం..

జిల్లాలోని 23 మండలాల్లో ఇటీవలనే భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఏఏ ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగిందో నివేదికలు రూపొందించారు. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వర్షాలు బాగా కురువడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రెండు, మూడేండ్ల నుంచి చూసుకుంటే ఈ యేడాది వర్షాలు అధికంగా కురిశాయి. జిల్లా లో సరాసరి భూగర్భ జలమట్టం 11.48 మీటర్లు కాగా, కొమురవెల్లిలో 1.47 మీటర్ల లోతులో, దౌల్తాబాద్ మండలం ముబారస్‌పూర్‌లో 30.03 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో 16.25 మీటర్లు, ఈ ఏడాదిలో 11.48 మీటర్లు ఉండగా గత ఏడాది పోల్చుకుంటే 4.77మీటర్ల జలమట్టం పెరిగింది. గత ఏడాది అక్టోబర్ మాసంలో 16,76 మీటర్లు ఉండగా ఈ ఏడాది 11.48 మీటర్లు ఉంది.

గత ఏడాది పోల్చుకుంటే 5.29 మీటర్ల భూగర్భ జలమట్టం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి.
ఫలితంగా రైతులకు యాసంగి పంటలు సాగు చేసుకోవడానికి మంచి అవకాశం. రెండు మూడేండ్ల నుంచి వర్షాలు సరిగా లేవు. దీంతో చెరువు లు, కుంటలు, చెక్‌డ్యాంల్లో నీళ్లు లేక బావులు, బోరు బావులు ఎండిపోయాయి. ఫలితంగా పంటలు అంతంత మాత్రంగానే పండాయి. ఈ సారి ఆలస్యంగానైనా కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంటలు కొంత మేర దెబ్బతిన్నాయి. వర్షాలు మంచిగా పడడంతో భూగర్భ జలాలు పెరగడంలో యాసంగి సాగు గత ఏడాది కన్న ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. రైతులు యాసంగి సాగును ఎక్కువగా విస్తరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.జిల్లాలో ప్రధాన సాగు వరి పంట. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు వరి పంట వద్దు.. ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తున్నారు. వరి వేయడంతో ప్రతి యేటా వడగండ్ల వర్షాలతో నష్టపోతుండడంతో వరి సాగు వద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాణిజ్యపంటలు, ఆరుతడి పం టలు సాగు చేయడం మేలని అధికారులు చెబుతున్నారు.

-వర్షపాతం వివరాలు ఇలా ..
జిల్లాలో వర్షపాతం వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. జూన్, జులై మాసాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కొం తమేర ఉపశమనం ఇచ్చిన వర్షాలు సెప్టెంబర్, ఆక్టోబర్ మా సంలో వానలు దంచి కొట్టాయి. దీంతో చెరువులు, చెక్‌డ్యాం లు, కుంటలకు నీళ్లు చేరాయి. ఫలితంగా భూగర్భజలాలు పెరిగాయి. మూడేండ్ల నుంచి చూస్తే ఈసారి మంచి వర్షాలు పడ్డా యి. ఫలితంగా యాసంగి సాగు గణనీయంగా పెరగనున్నది.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...