పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలి


Fri,November 15, 2019 11:03 PM

రాయపోల్ : పదో తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణతను సాధించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థ్ధులు కృషి చేయాని మండల విద్యాధికారి నర్సవ్వ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాలలో స్కుల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రతి విద్యార్థి ఇప్పటి నుంచే లక్ష్యంగా పెట్టుకొని ర్యాంకులు సాధించించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధ్యమేనన్నారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణతను సాధించేందుకు ప్రతి రోజు పాఠశాలలను తనిఖీ చేస్తామన్నారు. ఉపాధ్యాయులు సైతం బాధ్యతగా విధులు నిర్వహించి విద్యార్థులకు బోధించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...