గ్రామీణ క్రీడాకారులను ఆదుకుంటాం


Fri,November 15, 2019 11:03 PM

తొగుట : మట్టిలో మాణిక్యంలా ఉన్న తెలంగాణలోని క్రీడాకారులను ఆదుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తనయుడు, టీఆర్‌ఎస్ నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అండర్ 17 రూరల్ వాలీబాల్ విభాగంలో తెలంగాణ తరఫున జాతీయ జట్టుకు ఎంపికైన మండలంలోని వెంకట్‌రావుపేటకు చెందిన కొయ్యడ ప్రణీత్ గౌడ్‌ను సతీశ్‌రెడ్డి ఆయన స్వగృహంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రణీత్ దుబ్బాక నియోజకవర్గం నుంచి జాతీయ జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ప్రణీత్ అంతర్జాతీయ పోటీల్లో భాగంగా నేపాల్ పర్యటనకు వెళ్లడానికి ప్రయాణ ఖర్చులు కావాల్సి ఉండడంతో స్పందించిన సతీశ్‌రెడ్డి రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు.

బాధిత కుటుంబానికి పరామర్శ..
చందాపూర్‌లో ఇటీవల ఈత చెట్టు మీది నుంచి పడి మరణించిన గ్రామంలోని జనగామ శ్రీనివాస్‌గౌడ్ కుటుంబాన్ని సోలిపేట సతీశ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ భార్య కవితను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాజీ సర్పంచ్ సిరిసిల్ల భాస్కర్ డెయిరీ ఫామ్‌ను సందర్శించారు. యువకులు పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, ఎంపీటీసీ కంకణాల నర్సింహులు, సర్పంచ్‌లు బొడ్డు నర్సింహులు, పాత్కుల లీలాదేవి తదితరులున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...