మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు


Fri,November 15, 2019 11:03 PM

దుబ్బాక టౌన్ : దుబ్బాక మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించినట్లు కమిషనర్ గోల్కొండ నర్సయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దుబ్బాక సర్కార్ దవాఖాన ఆధ్వర్యంలో కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని 90 మంది కార్మికులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ..మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు మురికి కాలువలను శుభ్రం చేయడం, చెత్తాచెదారం ఏరివేయడంతో కార్మికులు అనారోగ్యాలకు గురవుతున్నారని, దీంతో వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం తరచుగా వైద్య పరీక్షలను ఉచితంగా చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు నీటి సరఫరా, ఎలక్ట్రికల్, కార్యాలయ సిబ్బందికి సైతం వైద్య పరీక్షలను నిర్వహించామన్నారు. కార్యాలయంలో దవాఖాన సిబ్బంది సూపరింటెండెంట్ డా.జ్యోతి, వైద్యులు బల్బీర్‌సింగ్, సిబ్బంది దిలీప్, ప్రవీణ్, శేఖర్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...