జిల్లా గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు


Fri,November 15, 2019 11:02 PM

సిద్దిపేట టౌన్ : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రోండో రోజు జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ సభ్యులు బ్రహ్మం హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు గ్రంథాలయాలకు పూర్వవైభవం తెస్తున్నారన్నారు. విద్యార్థులకు బంగారు తెలంగాణలో పసిడి పంటల కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో గ్రంథ పాలకులు తిరుపతిరెడ్డి, దాసరి రాజు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, కనకలక్ష్మి, ఉపాధ్యాయులు రఘు, రాజు, రహేనా, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...