వణికిస్తున్న చలి


Thu,November 14, 2019 11:39 PM

-పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రత
-రోజురోజుకు పెరుగుతున్న చలి
-వృద్ధులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం
-ఉదయం 9 వరకు కురుస్తున్న మంచు
-గురువారం 19 డిగ్రీలు నమోదు
చేర్యాల, నమస్తే తెలంగాణ : చలి.. అబ్బాబ్బా.. చలి.. అంటూ వృద్ధుల్లో, చిన్నారుల్లో వణుకు పుట్టే పరిస్థితి జిల్లాలో నెలకొంది. రాత్రిపూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం మంచు కమ్మేస్తోంది. చలి తీవ్రత పెరుగడంతో తెల్లవారుజామున, ఉదయం సమయాల్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వారు పనికి వెళ్లలేకపోతున్నారు. సాధారణ జన జీవనంపై చలి ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. సాధారణంగా డిసెంబర్ 3వ వారంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం నెల ముందే చలి తీవ్రత పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు. గతేడాది 20 డిగ్రీలకే వణికిన జిల్లా ప్రస్తుతం 16 డిగ్రీలకు పడపోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చనుంది. సాయంత్రం 5గంటలకే చలి ప్రారంభం కాగా, ఉదయం 9గంటల వరకు దీని ప్రభావం ఉంటోంది. రాత్రి 10గంటల తర్వాత బయట తిరగలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చలి పెరిగిపోవడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జిల్లాలో ఈ నెల 9వ తేదీన గరిష్ఠంగా 30డిగ్రీలు, కనిష్ఠంగా 20డిగ్రీలు నమోదైంది. 12న గరిష్ఠం 30, కనిష్ఠం 19, 13న గరిష్ఠం 35, కనిష్ఠం 16, 14న గరిష్ఠం 29, కనిష్ఠం 19 ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...