ఆరుతడి పంటలతో అధిక లాభాలు


Thu,November 14, 2019 11:37 PM

జగదేవపూర్ : యాసంగిలో ఆరుతడి పంటలతోనే రైతులకు అధిక లాభాలు పొందవచ్చని రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ జంబులశ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సూచించారు. గురువారం మండలంలోని మునిగడప, తీగుల్‌నర్సాపూర్, ధర్మారం, అలిరాజ్‌పేట గ్రా మాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన రైతులకు ఆరుతడి పంటల సాగుపై వ్య వసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పించారు. వరికి బదులు ఆరుతడి పంటలైన నువ్వులు శనగలు, మొక్కజొన్న కూరగాయల సాగు చేపట్టాలన్నారు. ఎకరా వరి సాగుతో 3ఎకరాల విస్తర్ణంలో ఆరుతడి పటలను పండించ వచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కిరణ్‌గౌడ్, సర్పంచ్‌లు రజిత రమేశ్, రాజు,బాల్‌లక్ష్మి, ఏఈవోలు బాలక్రిష్ణ, ప్రి యాంక, నాయకుడు మల్లేశం పాల్గొన్నారు.

నీటి పొదుపు చేపట్టాలి : ఏఈవో
మర్కూక్ : తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం లో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏఈవో మచ్చేంద ర్ సూచించారు. మండలంలోని నరన్నపేటలో ఆరుతడి పంటల సాగు పై రైతులకు అవగాహన కల్పించారు. స్ప్రింక్లర్, డ్రిప్ పరికరాలతో నీటిని పొదుపు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చ న్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణవేణి, శ్రీశైలం, వార్డు సభ్యులు పరమేశ్వర్‌రెడ్డి, కనక య్య, భూపాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...