తేమ తక్కువ ఉంటేనే మద్దతు ధర


Thu,November 14, 2019 11:36 PM

గజ్వేల్ రూరల్ : రైతులు పండించిన పత్తిని 8శాతం లోపు ఉండేట్లు... బాగా ఆరబెట్టి తీసుకువస్తేనే ప్రభుత్వ మద్ధతు ధర పొందగలుగుతారని జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్ అన్నారు. గురువారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కేంద్రంలోపాటు సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు విక్రయించడానికి తీసుకువచ్చిన పత్తిలో తేమ, నాణ్యతను పరిశీలించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభు త్వం క్వింటాల్ పత్తికి రూ.5550 మద్దతు ధర ఇస్తుం దని... ఈ ధర కేవలం 8 శాతం లోపు తేమ ఉన్న పత్తికే చెల్లిస్తారన్నారు.

రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, మార్కెట్‌కు తీసుకుని రావాలని సూచించారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ పరిధిలో మొత్తం 7 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, ప్రతి మిల్లులో ముగ్గురు సీసీఐ అధికారులు, మార్కెట్‌లో యార్డులో మరో ముగ్గురు అధికారులు పత్తి కొనుగోళ్లలో రైతులకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, డీఏవో శ్రావణ్‌కుమార్.. తేమ పరీక్ష పరికరాలు, ఎలక్ట్రానిక్ యంత్రాలను పరిశీలించారు. ఏడీఏ కార్యాలయంలో సీసీఐ, పీఏసీఎస్ అధికారులతో సమావేశమై మద్దతు ధరపై రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ అనిల్‌కుమార్, మార్కెట్ యార్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...