ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరా


Thu,November 14, 2019 11:36 PM

గజ్వేల్ రూరల్ : పేదలకు అండగా ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు కొంటెమైన నర్సింలు అన్నారు. మండల పరిధిలోని బంగ్లావెంకటాపూర్‌లో కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపతూ చికిత్స పొందుతున్న పలువురికి గురువారం సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను అందజేశారు. గ్రామానికి చెందిన చిగురు మల్లవ్వ తీవ్ర అనారోగ్యంతో రెండుకాళ్లు నడవలేని స్థితిలో ఉంది. ఆమెకు రూ.30 వేలు, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యనారాయణకు రూ.60వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. సీఎం సహాయనిధి ఆపద సమయంలో పేదలకు ఆసరాగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు స్వామి, కృష్ణ, శ్రీను, రమేశ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...