బాలల భవిష్యత్ అందరి బాధ్యత


Thu,November 14, 2019 11:36 PM

కొండపాక : నేటి బాలలే రేపటి పౌరులు.. వారికి బంగారు భవిష్య త్ అందించాల్సిన బాధ్యత మానందరిపై ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అన్నారు. గురువారం ఐఆర్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని దమ్మక్కపల్లి మదిర గ్రామం పిట్టలవాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ... పిల్లల ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా తయారు కావాలని, అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. సంచారజాతుల కమ్యూనిటీ అభివృద్ధికి ఐఆర్డీ సంస్థ చేస్తున్న కృషినిఅభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని సూచించారు. చిన్నతనం నుంచే విద్యపై మక్కువ పెంచుకోవాలన్నారు. పిట్టలవాడ పాఠశాల విద్యార్థులకు ఆటవస్తువులతోపాటు పాఠశాలలో కిచెన్ గార్డెన్‌కు తనవంతు సహాకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఐఆర్డీఎస్ సంస్థ డైరెక్టర్ రాజలింగం, సర్పంచ్ నీల మల్లేశం, టీచర్లు రామచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మమత, కో ఆర్డినేటర్ బాలకృష్ణ, నరేంద్ర పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...