కంప్యూటర్ ఉచిత శిక్షణ


Thu,November 14, 2019 11:35 PM

గజ్వేల్ రూరల్ : నిరుద్యోగ యువతీయువకులకు కంప్యూటర్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డీడీ యూజీకేవై ప్రాజెక్టు మేనేజర్ బండారి ప్రశాంత్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కం ప్యూటర్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యం లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా ఈజీఎంఎం, డీఆర్డీ వో పర్యవేక్షణలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సం యుక్తంగా ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇస్తున్నాయనితెలిపారు. గజ్వేల్‌లోని శిక్షణ కేంద్రంలో అకౌంట్స్ ఎగ్జిక్యుటీవ్ కోర్సులో ట్యాలీ, కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తామన్నారు. 3 నెలల పాటు శిక్షణ లో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ నెల 16న శిక్షణ తరగతు లు ప్రారంభమవుతున్నాయని, 18 ఏండ్లు పూర్తై.. ఇంటర్ పాస్, ఆపై విద్యార్హత ఉన్న నిరుద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హత సర్టిఫికేట్లు, రేషన్, ఆధార్ కార్డులు, కుల, ఆదాయ ధుృవీకరణ పత్రాలు, 8 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతోపాటుతల్లిదండ్రులను తీసుకుని దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ ని రుద్యోగులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9505545303, 96039 51101 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...