అన్ని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు


Thu,November 14, 2019 11:35 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని కాటన్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కు పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు గురువారం జా యింట్ కలెక్టర్ పద్మాకర్ తెలిపారు. రైతులు పత్తిని శుభ్రపర్చి 8 నుంచి 12 శాతం తేమ ఉండేలా చూ సుకొని, రంగు మారని పత్తిని మార్కెట్ యార్డుకు లేదా కాటన్ మిల్లుకు తీసుకెళ్లి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. క్వింటాల్ పత్తికి ప్రభుత్వం రూ.5550 మద్దతు ధర ఇస్తుందని పేర్కొన్నారు. తేమ శాతం 8 కంటే ఎక్కువ ఉంటే ఒక్కో శాతానికి రూ.55.50 ధర తగ్గుతుందన్నారు.

12 శాతం కంటే ఎక్కువగా తేమ ఉన్నట్లయితే సీసీఐ పత్తి కొనుగోలు చేయదని, రైతులు పత్తిని బస్తాల్లో కాకుండా లూజుగా వాహనాల్లో తీసుకరావాలనిసూచించారు. రైతులు పత్తిని తెచ్చేటప్పుడు ఆధా ర్ కార్డు, బ్యాంకు పాసుబుక్, పట్టాదారు పాసుబుక్‌లను వెంట తీసుకరావాలన్నారు. సీసీఐ కొ నుగోలు చేసిన పత్తికి చెందిన డబ్బులపు ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాలో జమ చేస్తారన్నారు. పత్తి ఆరబెట్టి శుభ్రపర్చి కాయలు లేకుండా ఏరి, మా ర్కెట్‌కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...