కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


Wed,November 13, 2019 10:43 PM

అక్కన్నపేట: ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందు కు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అ న్నారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, రామవ రం, జనగామ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తి రుపతిరెడ్డి, జడ్పీటీసీ భూక్య మంగతో క లిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులకు ప్ర భుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పం డించిన పంటను దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835, సాధారణ రకానికి రూ.1815 చొప్పున చెల్లిస్తున్నారన్నారు. కొను గో లు కేంద్రాలకు వచ్చే రైతులు పాస్ బుక్ జిరాక్స్‌తో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్‌ను తీసుకువస్తే ధా న్యం విక్రయించిన రెండు రోజుల్లో నగదు జమ అవుతుందన్నారు.

దళారులతో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగదు వెంటనే ఇస్తామంటూ రైతులకు ఆశ చూపి సంచి కిలో, మట్టి కిలో తరుగు, క్యాష్ కట్టింగ్, రవాణా, హమాలీ చార్జి ఇతరత్రా వాటిని రైతుల నుంచి వసూలు చేస్తారని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలునాయక్, మండల వ్యవసాయాధికారి డాక్టర్ నాగేందర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎండీ షాబుద్దీన్, ఇసంపల్లి రవీందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పీచర సునీత, వనపర్తి స్వప్న, కత్తుల మానస, గొర్ల స్వప్న, లింగాల శ్రీనివాస్, వొద్దిరాల కవిత, సీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...