విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి


Wed,November 13, 2019 10:43 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : చట్టాలపై అవగాహన కలిగి ఉన్న వారు అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారని హుస్నాబాద్ మున్సిఫ్‌కోర్టు జడ్జి గూడ అనూష అన్నారు. బుధవారం సాయంత్రం హుస్నాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇటీవల జరిగిన జాతీయ న్యాయ సేవా దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయ శాస్త్రంలో ప్రతి ఒక్కరూ ప్రవేశం కలిగి ఉండాలన్నారు. సాధారణ విద్య ఉపాధి కల్పించడం కోసం దోహదపడితే న్యాయశాస్త్ర విద్య ఎలా బతకాలో నేర్పిస్తుందన్నారు. అందుకే ప్రతి విద్యార్థి తమ ఉన్నత చదువుల్లో భాగంగా న్యాయశాస్త్రంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయి, ఎన్ని ఇబ్బందులకు గురికావలసి వస్తుందో తెలిసిన వారు నేరాలకు పాల్పడే అవకాశం ఉండదన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను కూడా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వీటిని అతిక్రమించినప్పుడే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. వివిధ చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని తమ తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. సమావేశంలో ఏజీపీ కన్నోజు రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తారి రవీందర్, కార్యదర్శి బాకం సంపత్, ఎస్‌ఐ దాస సుధాకర్, న్యాయవాదులు సాయిని మల్లేశం, మురళీమోహన్, వెంకటయ్య, రాంబాబు, అజయ్‌కుమార్, పాఠశాల హెచ్‌ఎంలు ఎస్ వెంకటయ్య, బండారి మనీల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...