టీఆర్‌ఎస్ హయాంలోనే మత్స్యకారులకు గుర్తింపు


Wed,November 13, 2019 10:42 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మత్స్యకారులకు సరైన గుర్తింపు వచ్చిందని ఎంపీపీ లకావత్ మానస అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువులో అక్కన్నపేట జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్యతో కలిసి చేపలు వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపలు పంపిణీ చేయడతో పాటు వాటిని మార్కెట్ చేసుకునేందుకు వాహనాలను సైతం సబ్సిడీపై అందజేసిందన్నారు. మత్స్య కారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేపలను విరివిగా పెంచుకొని మార్కెట్‌లో విక్రయించుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి వెంకయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నమిలికొండ రాజయ్య, మత్స్య కార్మికులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...