ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యతనివ్వాలి


Wed,November 13, 2019 10:42 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : యాసంగి సీజన్‌లో రై తులు ఎక్కువగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ విస్తరణాధికారి ప్రత్యూష అన్నారు. బుధవారం కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో జరిగిన యా సంగి పంటల సాగుపై రైతులకు జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వ్యవసాయ బావులు, బోర్ల కింద వరి పంట సాగు చేసేకంటే ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ఎంచుకొని సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు వస్తాయన్నారు. వరి పంటకు ఎక్కువ సాగు నీరు అవసరం ఉంటుందని, పంట చివరి ద శలో ఎండిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, మినుములు, వేరుశనగ లాంటి పంటలను సాగు చే సుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు సలహాలు, సూ చనలతో యాసంగిలో సాగు మొదలుపెట్టుకోవాలని సూ చించారు. సమావేశంలో సర్పంచ్ పాము నాగేశ్వరి, ఎంపీటీసీ కోనె శేఖర్, ఆర్‌ఎస్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు బండమీది రాజమౌళి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటల సాగుపై అవగాహన
బెజ్జంకి : మండలంలోని బేగంపేట, కల్లెపల్లి గ్రామాల్లో వ్య వసాయశాఖ ఆధ్వర్యంలో ఆరుతడిపంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ రికి బదులుగా స్వల్ప కాలిక పంటలను సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని వివరించారు. అదే విధంగా బె జ్జంకిలో దేశ్‌పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగాకర్షక బు ట్టలు, పసుపురంగు జిగురు అట్టల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్, సంస్థ మేనేజర్ రాజు, రై తులు శ్రీనివాస్, భూమయ్య, అశోక్ పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...