పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలు


Wed,November 13, 2019 01:46 AM

సిద్దిపేట టౌన్‌ : ప్రజారవాణా ప్రయాణికులకు మె రుగైన సేవలను అందిస్తుంది. కార్తిక పౌర్ణమి పండుగ పూట ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఆర్టీసీ కార్మికులు 38 రోజులుగా సమ్మెలో ఉన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి సఫలీకృతమవుతున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను కేటాయిస్తూ వాటి సంఖ్యను పెంచుతున్నారు. కార్తిక పౌర్ణమి రోజున జిల్లాలోని అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇందుకు అనుగుణంగా పట్టణ ప్రాం తాలతోపాటు మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యాన్ని కల్పించారు. జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, గజ్వేల్‌ డిపోలు ఉన్నా యి. మంగళవారం ఆర్టీసీ బస్సులు సిద్దిపేట డిపో పరిధిలో 67, దుబ్బాక 22, హుస్నాబాద్‌ 34, గజ్వేల్‌ 47, హైర్‌విత్‌ 66 బస్సులు జిల్లా వ్యాప్తంగా 236 బస్సులు ప్రయాణీకులను తరలించాయి. సీసీ బస్సు లు 13, మ్యాక్స్‌క్యాబ్‌ 80 నడిచాయి. మొత్తం 331 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

* రోడ్డెక్కిన 89 శాతం బస్సులు
ప్రజా రవాణా మెరుగైన సేవలు అందిస్తూ ప్రయాణికుల మన్ననలు అందుకుంటుంది. అన్ని రూట్లలో బస్సులు నడిచేలాకలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జో యల్‌ డెవిస్‌, డీటీవో రామేశ్వర్‌రెడ్డి, డిపోల మేనేజర్లు ప్రత్యేక కార్యచరణతో బస్సులు అన్ని ప్రాంతాలకు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. సిద్దిపేట డిపోలో 99 శాతం బస్సులు నడిచాయి. దుబ్బాక 61 శాతం, హుస్నాబాద్‌ 89, గజ్వేల్‌ 94 రోడ్లపై ఆర్టీసీ బస్సులు 89 శాతం ప్రయాణికులను తీసుకెళ్లాయి. హైర్‌విత్‌ 87 శాతం, ప్రైవేట్‌ వాహనాలు 88 శాతం రోడ్లపై పరుగులు తీశాయి. బస్సు డిపోల వద్ద, బస్టాండ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

* దుబ్బాకలో కనిపించని సమ్మె ప్రభావం
దుబ్బాక టౌన్‌ : కార్మికులు కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం 39వ రోజు దుబ్బాకలో ఏమాత్రం కనిపించలేదు. సమ్మె సందర్భంగా ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా దుబ్బాక డిపోలో ఉన్నతాధికారులు, పోలీసులు ముందస్తుగా అన్ని చర్య లు తీసుకుంటుంన్నారు. డిపోలో మొత్తం 35 ఆర్టీసీ, 4 పైవేట్‌ బస్సులు మొత్తం 39 బస్సులు నడించాయి. తాత్కాలికంగా నియమించిన డ్రైవర్లు, కండక్టర్లతో ప్రధాన రూట్లతో బస్సులను నడిపారు. సమయానుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతూ ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నా రు. ముఖ్యంగా దుబ్బాక - సిద్దిపేట, దుబ్బాక - గజ్వే ల్‌ - సికింద్రాబాద్‌, దుబ్బాక - కామారెడ్డి, దుబ్బాక - రామాయంపేట్‌, దుబ్బాక - సిద్దిపేట - మెదక్‌ రూ ట్లలో బస్సులను నడిపినట్లు డిపో ఇన్‌చార్జి రాథోడ్‌ తెలిపారు. దుబ్బాక డిపో బస్సులు అన్నిరూట్లలో తిరిగా యి. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులు నిరసనలు యథావిధిగా కొనసాగిస్తున్నారు. కార్మికులకు మద్దతుగా కాం గ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి దుబ్బాకలో సభ నిర్వహించారు.

రద్దీకి అనుగుణంగా బస్సులు..
గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌ బస్టాండ్‌లో బస్సులు వివిధ రూట్లలో వెళ్లడానికి అం దుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. బస్సులు వివిధ రూట్లలో నడవడంతో రవాణా సౌకర్యం అన్ని గ్రామాలకు సమకూరింది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...