బస్సులు ఫుల్‌.. సమ్మె నిల్‌


Wed,November 13, 2019 01:46 AM

- మెదక్‌ రీజియన్‌లో తిరిగిన 518 బస్సులు

సంగారెడ్డి టౌన్‌ : మెదక్‌ రీజియన్‌ పరిధిలో ఆర్టీసీ బస్సులు ఫుల్‌గా తిరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలలో ప్రతి ప్రాంతానికి బస్సు సేవలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉదయం నుంచే బస్సులను తిప్పుతూ గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. మెదక్‌ రీజియన్‌లో 626 బస్సులు ఉండగా, 518 బస్సుల ద్వారా ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చారు. 363 ఆర్టీసీ, 155 ప్రైవేట్‌ బస్సుల ద్వారా సేవలందించారు. రీజియన్‌లో 518 బస్సులు గ్రామీణ ప్రాంతాలకు సైతం తిప్పుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నా బస్సులు యథేచ్చగా సేవలందిస్తున్నాయి.

రీజియన్‌లో తిరిగిన 518 బస్సులు..
మెదక్‌ రీజియన్‌లో 518 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. మెదక్‌ డిపోలో 43 ఆర్టీసీ, 36ప్రైవేటు బస్సులు ప్రయాణికులను తరలించాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ డిపోలో 55 బస్సులు ఉండగా 37 ఆర్టీసీ, 5 ప్రైవేట్‌ బస్సులు తిరిగాయి. సంగారెడ్డి డిపోలో 108 బస్సులు ఉండ గా 71 ఆర్టీసీ, 26 ప్రైవేట్‌ బస్సులు ప్రజలకు సేవలందించాయి. జహీరాబాద్‌ డిపోలో 90 బస్సులు ఉండగా 42 ఆర్టీసీ, 22 ప్రైవేట్‌ బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాం తాలకు చేరవేశాయి. సిద్దిపేట డిపోలో 67 ఆర్టీసీ, 30 ప్రైవే ట్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపో లో 47 ఆర్టీసీ, 20 ప్రైవేట్‌, దుబ్బాక డిపోలో 22 ఆర్టీసీ, 4 ప్రైవేట్‌, హుస్నాబాద్‌ డిపో లో 34 ఆర్టీసీ, 12 ప్రైవేట్‌ బస్సులు సేవలందించాయి.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...