మురంశెట్టికి ఘన సన్మానం


Mon,November 11, 2019 11:31 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: సేవాభావం కలిగిన వారు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని, వారు చేసిన సేవలే వారిని ముందుకు నడిపిస్తాయని కొత్తపల్లి, బెజ్జంకి ఆశ్రమాల నిర్వాహకులు సనకసనంద సరస్వతీ స్వామి, చిదానందగిరి స్వామి అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లోని వీఎల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో టీటీడీ పాలకమండలి సభ్యుడు మురంశెట్టి రాములుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మొదటి నుంచీ సేవాభావంతో ముందుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన మురంశెట్టి రాములుకు టీటీడీ పాలకమండలి పదవి ఇంటికి నడిచొచ్చిందన్నారు. ఇది ఆయన చేసిన సేవలకు నిదర్శనమన్నారు.

హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ టీటీడీ పాలకమండలి సభ్యునిగా నియామకం అయిన మురంశెట్టి సేవలను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మురంశెట్టి మాట్లాడుతూ అనంతరం భార్గవాపురం సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం, శ్రీవైష్ణవ సంఘం, వివిధ భక్త సమాజాలు, స్థానిక కళాకారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మురంశెట్టిని పూలమాలలు, కండువాలు, ధోవతులతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, రెడ్డి జేఏసీ కన్వీనర్ మంజులారెడ్డి, భార్గవాపురం సేవా సమితి అధ్యక్షుడు చిట్టి గోపాల్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండ్లె రాజేశ్వర్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...