సాఫీగా సాగుతున్న ప్రయాణం


Mon,November 11, 2019 02:41 AM

సూర్యాపేట వ్యవసాయం :37 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతుంది. ఆదివారం కావడంతో తాత్కాలిక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సర్వీసులను తగ్గించి మిగ తా సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఒకటి రెండు మినహా అన్ని ప్రాంతాలకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులను కల్పిస్తున్నారు.రద్దీ లేని ప్రదేశాలకు బస్సులను తగ్గించారు.సూర్యాపేట డిపోలో ఆర్టీసీ సంస్ధకు చెందిన 54 బస్సులతో పాటు ,43అద్దె బస్సులు కలుపుకొని 97 సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు డిపో మేనేజన్ శ్రీనివాస్ తెలిపారు.

అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు పరుగులు
కోదాడటౌన్ : కోదాడ ఆర్టీసీ డిపోలోని బస్సులు అన్ని రూట్లలో పరుగులు పెడుతున్నాయి.ఆర్టీ సీ జేఏసీ సమ్మె ప్రభావం పట్టణంలో ఆదివారం ఎక్కడా కనిపించలేదు. ప్రయాణికులతో బస్టాండ్ కిటకిటలాడింది. పోలీస్, రవాణా, ఆర్టీసీ అధికారులు సమన్వయంలో బస్సులను అన్ని రూట్లలో నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆదివారం కోదాడ డిపో పరిధి నుంచి 44 ఆర్టీసీ బస్సులు,30 అద్దె బస్సులు తిరిగాయి. డిపో నుంచి మొత్తంగా 74 బస్సులు రోడ్ల మీద పెరిగెత్తాయి.తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్ల పనితీరును పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి,డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్ కుమార్ పరిశీలించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...