ప్రపంచాన్ని చిన్నది చేసిన ఘనత ఇంటర్‌నెట్ దే


Mon,November 11, 2019 02:40 AM

సూర్యాపేట వ్యవసాయం : గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులకు ఉపయోగపడే ఇంటర్‌నెట్ ప్రపంచాన్ని చిన్నది చేసి అనేక విషయాలను తెలుపుతుందని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాలలో మధుమిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వినియోగం, నిర్వాహణ (ఐఓటీ )పై ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేద,మధ్యతరగతి విద్యార్థ్ధు లు వేల రూపాయలు ఖర్చు చేయకుండా సూర్యాపేటలో ఏర్పాటు చేయడం విద్యార్ధులకు ఒక వరమన్నారు.

ప్రస్తుత ప్రపంచంలో ఆంగ్లం ప్రాధాన్యత ఎక్కువగా ఉందని దానిపై వి ద్యార్థ్ధులు శ్రద్ధ పెడితే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని గుర్తించాలని సూచించారు. ఎస్వీ కళాశాలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ మాట్లాడుతూ ఇంటర్ నెట్‌లో మంచి,చెడు ఉంటుందని మంచి ని మాత్రమే వినియోగించుకుని విద్యార్థ్ధులు ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు.అందకు ముందు జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జేసీ సంజీవరెడ్డి,ప్రిన్సిపల్ రవీ ంద్రాచారి, ప్రొఫెసర్ డా.రవికుమార్,ఫౌండేషన్ చైర్మన్ భాగ్యలక్ష్మీ,రవి, శరత్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...