జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో రాణించిన ఎంజీయూ జట్టు


Mon,November 11, 2019 02:40 AM

నల్లగొండ విద్యావిభాగం : కర్ణాటక కాలికట్ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాండ్‌బాల్ పోటీలో ఎంజీయూ మహిళా జట్టు రాణించింది. ఆదివారం తొలిరోజు జేఎన్టీయూ అనంతపురం జట్టుతో జరిగిన హోరాహోరీ పోరులో విజ యం సాధించింది. జట్టు విజయం పట్ల క్రీడాకారులతోపాటు యూన్సివర్సిటీ బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు. మరో మ్యాచ్ ఆడనుండగా విజయమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు ఎంజీయూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శి డా. జి. ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. క్రీడాకారులతో కోచ్‌గా టీఎస్‌డబ్ల్యూఏఎఫ్‌పీడీసీడబ్ల్యూ భువనగిరి పీడీ కె. లక్ష్మి , జట్టు మేనేజర్, ఎంజీయూ పీడీ డా.వై. శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...