రాష్ట్రస్థాయి ఒలిపింక్స్‌కు వేళాయె..


Sun,November 10, 2019 11:47 PM

-రేపటి నుంచి 6వ రాష్ట్రస్థాయి స్వేరోస్ ఒలింపిక్స్- 2019
-ఈ నెల 15 వరకు క్రీడలు
-ఉమ్మడి పది జిల్లాల్లో 88 గురుకుల పాఠశాలలకు అవకాశం
-పోటీల్లో పాల్గొననున్న 1600 మంది విద్యార్థులు
-ప్రారంభోత్సవాలకు హాజరు కానున్న ప్రజాప్రతినిధులు

కొండాపూర్: ఆటలు.. ఆటలు.. ఆటలు.. వీటి పేరు వింటేనే విద్యార్థుల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతున్నది. పలు అంశాల క్రీడల్లో విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి సత్తాచాటే అవకాశం వచ్చింది. గురుకుల పాఠశాలలు ఉత్తమ విద్యాబోధనకు మార్గదర్శకాలుగా తెలంగాణ ప్రభుత్వం నిలిపేలా చేసిన విష యం తెలిసిందే. అదేస్ఫూర్తితో చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధించి గురుకుల పాఠశాలల విద్యార్థులు గీటురాయిగా నిలుస్తున్నారు. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. 6వ రాష్ట్ర స్థాయి స్వేరోస్ ఒలింపిక్స్-2019 క్రీడలకు కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాల వేదిక కానున్నది. ఉమ్మడి 10 జిల్లాల గురుకుల పాఠశాలల విద్యార్థులు క్రీడాల్లో పాల్గొనున్నారు. 12వ తేదీ నుంచి 15వరకు నాలుగు రోజుల పాటు జరుగనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యతోపాటు, ఆటల్లో ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ సహకారంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.

రేపటి నుంచి ప్రారంభం..
ఈనెల 12వ తేదీ నుంచి 15వరకు నాలుగు రోజుల పాటు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి 10 జిల్లాలను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా 88గురుకుల బాలుర పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 12,13, 14,15 తేదీల్లో పోటీలు జరుగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు కొండాపూర్‌లో బాలుర, చిట్కుల్‌లో బాలికలకు ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. 6వ రాష్ట్రస్థాయి స్వేరోస్ ఒలింపిక్స్ లాంటి క్యాంపులను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని విద్యార్థులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.

అండర్ 14-17-19 విద్యార్థులకు అవకాశం..
అండర్14-17-19 విద్యార్థులకు ఏర్పాటు చేశారు. ఉమ్మడి 10 జిల్లా నుంచి 1600 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనున్నారు. కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖో, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్యార మ్స్, చెస్, టెన్నికైడ్ తదితర ఆటలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు క్రీడలతోపాటు చదువులో కూడా రాణించేలా గురుకుల పాఠశాలల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈ ప్రణాళికను రూపొందించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏ ఆటలైనా కొండాపూర్ గురుకులం నుంచే..
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలకు సంబంధించి కేవలం జిల్లాలోని కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలోనే నిర్వహిస్తారు. ఇంతకుముందు జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రమేశ్ కూడా తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల ఆటలను ఇక్కడే ప్రారంభించారు. అప్పటి నుంచి ఇలా ప్రతిసారి ఏ ఆటలు మొదలుపెట్టినా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకులం నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంటున్నారు. గురుకుల పాఠశాలలో జరిగిన యూత్ పార్లమెంట్, బ్యాటరీ టెస్టులు, సమ్మర్ సమురాయ్, తదితర ఆటలు కూడా ఇక్కడే నిర్వహించారు. పోటీల్లో ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పాల్గొని ఎన్నో విజ యాలు సాధించిన ఘనత ఈ పాఠశాలకే దక్కింది.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...