యువత అన్ని రంగాల్లో రాణించాలి


Sun,November 10, 2019 11:45 PM

మర్కూక్ : యువత అన్ని రాంగాల్లో రాణించాలని యువతతోనే సమాజంలో మార్పు వస్తుందని ఏసీపీ నారాయణ అన్నారు. రెండు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ యువత తలుచుకుంటే సాధించలేనిది లేదన్నారు. సమాజంలో మార్పు యువతతోనే సాధ్యమని పేర్కొన్నారు. యువత ఆర్థికంగా ఎదుగుతూ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ పాండుగౌడ్ మాట్లాడుతూ గెలుపోటములు సహజమని పేర్కొన్నారు.

ప్రథమ స్థానంలో సిద్దిపేట జట్టు
రెండు రోజుల పాటు మర్కూక్‌లో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో సిద్దిపేట జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో చేర్యాల జట్టు, తృతీయ స్థానంలో ములుగు జట్టు గెలిచిందని నిర్వాహకులు తెలిపారు. వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు ఏసీపీ నారాయణ ప్రదానం చేశారు. మొత్తం 44 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో ఏసీపీ నారాయణ, సీఐ కోటేశ్వర రావు, ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్, ఎంపీపీ పాండుగౌడ్‌లతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాల్‌రెడ్డి, మర్కూక్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ చైతన్య శంకర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం, సర్పంచ్‌లు నాగరాజు, మల్లేశం, కొండల్‌రెడ్డి, కబడ్డీ కో ఆర్డినేటర్ మాజీ సర్పంచ్ నర్సింహులు, కార్యక్రమ సమన్వయ కర్త చిన్ని కృష్ణ సభ అధ్యక్షుడిగా దుబ్బాక యాదగిరి, క్రీడకారులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...