తొగుట వైన్స్ సీజ్


Sun,November 10, 2019 11:44 PM

తొగుట : ఆరంభంలోనే ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో తొగుట వైన్స్‌ను ఆదివారం మిరుదొడ్డి ఎక్సైజ్ సీఐ హన్మా నాయక్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే తొగుటలో కొత్తగా టెండర్ల ద్వారా మద్యం షాపును దక్కించుకున్న మల్లికార్జున స్వామి వైన్స్ యాజమాన్యం ఎమ్మార్పీని మించి వసూలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు రావడంతో అధికారుల ఆదేశంతో జిల్లా ఎక్సైజ్ స్వాడ్ విచారణ చేయగా నిజమేనని తేలడంతో ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో నిబంధనలు పాటించని తొగుట వైన్స్‌ను సీజ్ చేయాలని మిరుదొడ్డి ఎక్సైజ్ సీఐ హన్మానాయక్‌కు ఆదేశాలు రావడంతో ఆదివారం వైన్స్‌ను సీజ్ చేసి రూ.2లక్షల జరిమానా విధించామన్నారు. జరిమానాను వారు చెల్లించారన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...