దూది దిగుబడికి వానల దెబ్బ


Fri,November 8, 2019 11:08 PM

-ముందు అనుకూలం.. తర్వాత ప్రతికూలం
-వానలకు తోడు తెగుళ్ల బెడద
-అధిక తేమతో లభించని మద్దతు ధర
-జోరుగా పత్తి విక్రయాలు
-నిన్నటివరకు 31,971 క్వింటాళ్ల కొనుగోలు

గజ్వేల్, నమస్తే తెలంగాణ : వానకాలం మొదట్లో ఆశలు పెంచుతూ జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగైన తెల్ల బంగారం.. ఇప్పుడు రైతు ఇంటికి చేరుతుంది. జిల్లావ్యాప్తంగా పత్తి సేకరణ తొలిదఫా పనులు ప్రారంభమయ్యా యి. ఆలస్యమైనా అరకొర వర్షాలు ప్రారంభంలో పత్తి సాగుకు అనుకూలించడంతో విస్తీర్ణం బాగా పెరిగింది. తర్వాత అనుకూల వాతావరణ పరిస్థితులతో పైరు ఏపుగా పెరిగినప్పటికీ చివరలో వరుస వర్షాల వల్ల పత్తి నాణ్యత తగ్గడమే కాకుండా పైరు తెగుళ్లకు గురై దిగుబడులు తగ్గే పరిస్థతి ఏర్పడింది. చేనులో తడిసిన పత్తి.. రంగు మారడం, తేమ అధికంగా ఉండటంతో ధర తగ్గింది. సీసీఐ కూడా కొనుగోలు చేయకపోవడంతో మద్దతు ధర లభించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 31,971 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరగగా క్వింటాలుకు అత్యధికంగా రూ 4500 లోపే ధర లభించింది.

వానకాలంలో జిల్లాలో ప్రధాన పంటగా పత్తి అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. మొక్కజొన్న, వరి పంటల సాగు తగ్గి.. పత్తి సాగు ఊహించని విధంగా పెరిగింది. అరకొర వర్షాలతో సైతం పత్తి పైరు ఏపుగా ఎదిగింది. జిల్లాలో 2 లక్షల 25వేల ఎకరాలకు పైగా సాగైనట్లు అంచనా. కలుపు నివారణ పనులకు వాతావరణం అనుకూలించడంతో పైరు ఏపుగా పెరిగింది. నల్ల రేగడి తోపాటు ఎర్ర నేలల్లో కూడా పత్తి ఆశించిన విధంగా దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేశారు. గతంలో ఎకరాకు 3-4 క్వింటాళ్ల సరాసరి దిగుబడి రాగా, ఈ సారి 9 - 10 క్వింటాళ్ల కు మించి సరాసరి దిగుబడి రావచ్చని భావిస్తున్నారు.

విత్తన నాణ్యత కలిసి వచ్చినా.. నిరాశే
నకిలీ, కల్తీ విత్తనాలతోపాటు గడ్డి విత్తనాలని బీటీ 3 రకం అంటూ దొంగచాటుగా విక్రయించి రైతులను దళారులు ధరతో పాటు విత్తన నాణ్యతలో మోసం చేయడంతో నష్టాలకు గురి చేశారు. ఈ యేడాది ప్రభుత్వం విత్తన నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ నకిలీ, కల్తీ విత్తన అమ్మకాలపై నిఘూ ఏర్పాటు చేసింది. తద్వారా జిల్లాలో రూ.34 లక్షల విలువ చేసే 1365 కిలోలకు పైగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ప్రభుత్వం ముందస్తుగా జిల్లాకు 5 లక్షల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచింది. అయితే, వర్గల్, రాయపోల్, ములుగు, మర్కూక్ మండలాల్లో అనుమతి లేని పత్తి విత్తనాలు కొంత విస్తీర్ణంలో సాగైంది.

రైతన్నల ఆశలు ఆవిరి..
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 20 నుంచి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన రైతులు ఎకరాకు 10 నుంచి 18 క్వింటాళ్లు పండించారు. ఈయేడాది మరింతగా దిగుబడులు పెరిగే అవకాశాలు కన్పించాయి. సెప్టెంబర్ చివరివారం వరకు పత్తి బాగా ఉంది. తర్వాత వర్షాలు పడడంతో తెగుళ్ల బెడద పాటు విచ్చుకున్న పత్తి కాయల్లోకి వర్షం నీరు వెళ్లి కుళ్లిపోవడం, నల్ల బారింది. అక్టోబర్‌లో అనేక రోజులు వర్షం పడటంతో కా య దశలోని పత్తి పైరు అధిక తేమను తట్టుకోలేదు. తద్వారా ఎరువు తెగుళ్లు అధికం కాగా పైరు అనేక ఎకరాల్లో దెబ్బతింది.

మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం..
జిల్లావ్యాప్తంగా 2లక్షల 25వేల ఎకరా ల్లో సాగైన పత్తి పంట.. సుమారు 1 లక్ష 50 వేల టన్నులకు పై గా దిగుబడి వస్తుందని అంచనా. ఇందుకు అనుగుణంగా జిల్లా లోని గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాణ్యమైన పత్తి క్వింటాల్‌కు రూ.5550, అత్యల్పంగా రూ.5150లను సీసీఐ చెల్లింస్తుంది. 12శాతం మించి తేమ ఉంటే కొనుగోలు చేయరు.

మార్కెట్‌లో అందని మద్దతు ధర..
అన్నిప్రాంతాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నప్పటికీ పత్తిలో తేమశాతం అధికంగా ఉండటంతో మద్దతు ధర దక్కడడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరిగాయి. అయితే, ఎక్కువ పత్తిని ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.3200 నుంచి రూ.4500 వరకు కొనుగోలు చేశారు. పింజ నాణ్యత తగ్గిందని, పత్తి నల్లబారిందని, తేమ 12 శాతానికి మించి ఉందని వ్యాపారులు సాకులు చూపి పత్తిని కొనుగోలు చేస్తున్నారు.

31,971 క్వింటాళ్ల పత్తి కొనుగోలు..
జిల్లాలోని 9 మార్కెట్ యార్డుల్లో నేటివరకు 31,971 క్విం టాళ్ల పత్తి కొనుగోలు జరిగింది. అత్యల్పంగా రూ.3300 నుంచి అధికంగా రూ.4500లు చెల్లించారు. శుక్రవారం నాటికి సిద్దిపేటలో 2215 క్వింటాళ్లు, చిన్నకొడూరులో 2930 క్వింటాళు,్ల గజ్వేల్‌లో 12,320 క్వింటాళ్లు, హుస్నాబాద్‌లో 6215 క్విం టాళ్లు, బెజ్జంకిలో 1330 క్వింటాళ్లు, చేర్యాలలో 2585 క్వింటా ళ్లు, దౌల్తాబాద్‌లో 1009 క్వింటాళ్లు, కొండపాకలో 2433 క్విం టాళ్లు, తొగుటలో 434 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...