అల్పాహారం పథకం విద్యార్థులకు వరం


Fri,November 8, 2019 11:06 PM

సిద్దిపేట అర్బన్ : సత్యసాయి అన్నపూర్ణ అల్పాహార పథకం విద్యార్థులకు వరంగా మారుతున్నదని జి ల్లా విద్యాశాఖాధికారి డా.రవికాంతారావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, ప్రాథమిక పాఠశాల, పిట్టలవాడ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు శుక్రవారం సత్యసాయి ట్రస్ట్ సహకారంతో అన్నపూర్ణ అల్పాహార పథకాన్ని ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కొమ్ము రాజయ్య, ఉప సర్పంచ్ రాజవెంకట్‌రెడ్డి, మిట్టపల్లి పీఏసీఎస్ చైర్మన్ వంగ ప్రవీణ్‌రెడ్డి, ఓఎస్‌డీ బాల్‌రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా డీఈవో మాట్లాడుతూ అల్పాహార పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు దాతలు సహకరించడం సం తోషించ దగ్గవిషయమన్నారు. మందపల్లి ఉన్నత పాఠశాల శిథిలావస్తకు చేరినందున మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రజాప్రతినిధు లు, గ్రామస్తులు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.

పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించడంతో సర్పంచ్ కొమ్ము రాజయ్య పాఠశాలకు విరాళంగా రూ.5 వేలను ఇవ్వగా, ఆయనను డీఈవో అభినందించారు. పథకం అమలుకు సహకరిస్తున్న సత్యసాయి ట్రస్ట్‌వారిని, గ్రామానికి చెందిన సత్తిరెడ్డి కుమారులను, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము రాజయ్య, ఉప సర్పంచ్ పన్యాల రాజవెంకట్‌రెడ్డి, ఉపాధి హామీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ తుపాకుల బాల్‌రంగం, మాజీ జడ్పీటీసీ దేవునూరి తిరుపతి, సిద్దిపేట అర్బన్ వైస్ ఎంపీపీ అల్లం ఎల్లం, ఎంఈవో యాదవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, పద్మ, ఉపాధ్యాయులు, నాయకులు రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...