18 తేదీన సిద్దిపేటలో జాబ్‌మేళా


Fri,November 8, 2019 11:06 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మిషన్ డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశం మేరకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 18న మెగా జాబ్‌మేళాను కొండ మల్లయ్య, కొండా భూదేవి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్‌మేళాకు వచ్చే విద్యార్థులు 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వారై ఉండి కనీస విద్యార్హత 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీఫార్మసీ, పీజీ చదివిన ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. జాబ్‌మేళాకు వచ్చే వారు విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలు తీసుకొని www.jobmela.tmepma.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

జాబ్‌మేళాలో టెక్నికల్, ఫార్మా, బ్యాంకింగ్, సేల్స్, సెక్యూరిటీ, సర్వీసు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతాయన్నారు. ఉద్యోగులను ఎం పిక చేసుకునేందుకు అపోలో ఫార్మాసీ, ఎల్జీ, స్విగ్గి, యునైకపోర్బ్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, మైండ్‌మ్యాప్, ఎస్‌కే ల్యాండింగ్ సర్వీసెస్, అపోలో ఫెసిలీటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రాబ్స, యాక్ట్, క్యూర్ ఫుడ్స్, రిలయన్స్ ట్రెండ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆక్‌సెంచరీ, జస్ట్ డయల్ కంపెనీలు హాజరవుతాయన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు 4,5 సెట్ల ధ్రువపత్రాలతో పాటు రెస్యూమ్‌లు తీసుకొని రావాలన్నారు. రిజిస్ట్రేషన్లు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటాయని అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు డీఎంసీ హన్మంతరెడ్డి 9177303439, ఏడీఎంసీ సంతోషిమాత 9030045242, టీఎంసీ సాయికృష్ణ 9701385609 నంబర్లను సంప్రదించాలన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...